Begin typing your search above and press return to search.

సీన్ రివ‌ర్స్ : టెక్నాల‌జీ కోర్సుల‌కు డిమాండ్ నిల్‌

By:  Tupaki Desk   |   9 May 2017 1:21 PM GMT
సీన్ రివ‌ర్స్ : టెక్నాల‌జీ కోర్సుల‌కు డిమాండ్ నిల్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యాల ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఇది. ట్రంప్ నిర్ణ‌యాల కార‌ణంగా క‌ల‌లుగా మారిపోతున్న ఐటీ ఉద్యోగార్థుల ఆశ‌లు ఒక కోణం కాగా...తాజాగా మ‌రో కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే టెక్నాల‌జీ కోర్సుల‌కు డిమాండ్ ప‌డిపోవ‌డం. ఇంజనీరింగ్ పూర్తికాగానే ఎక్కువమంది ఐటీ కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. ఐటీ శిక్షణ సంస్థల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇందుకు తాజాగా హైద‌రాబాద్‌లోని హాట్ కోచింగ్ స్పాట్ అయిన అమీర్ పేట్ క‌నిపిస్తోంది.

స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు భారత్ కు చెందిన సాప్ట్ వేర్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో స్థానికులకే అనివార్యంగా ఉద్యోగాలను ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. త‌ద్వారా ఉన్న ఉద్యోగాల ప‌రిస్థితే గంద‌ర‌గోళంగా మారింది. ఇక కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న అనేది దురాశ అవుతుంద‌ని భావిస్తున్న యువ‌త టెక్నాల‌జీ కోర్సుల‌కు దూరంగా ఉంటున్నారు. తెలుగు రాష్ర్టాల‌లోని వారే కాకుండా పొరుగు రాష్ర్టాల‌లోని విద్యార్థులు సైతం వ‌చ్చి జావా, డాట్ నెట్, టెస్టింగ్ టూల్స్, శాప్‌ వంటి కోర్సుల్లో చేరేందుకు ఇక్క‌డి ఇన్‌స్టిట్యూట్‌ల‌లో నేర్చుకునేవారు. ఇలా వందల సంఖ్యలో ఈ కోర్సుల్లో శిక్షణ పొందేవారు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పదుల సంఖ్యకు పడిపోయిందట‌. దీంతో కోచింగ్ సెంటర్లను నిర్వహించడం కూడ కష్టంగా మారిందని కోచింగ్ సెంటర్ల నిర్వాహాకులు వాపోతున్నారు.

ఇంత‌కీ టెక్నాల‌జీ కోర్సులు వదిలిపెడ్తున్న విద్యార్థులు మ‌రి ఎటువైపు సాగుతున్నారంటే ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది. ఐటీ కోర్సులు చేసి ఉద్యోగం కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూడడం కంటే తక్షణమే ఉద్యోగం వచ్చే కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నార‌ట‌. ఐటీ కోర్సులను వదిలేసి జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఎంచుకొని విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని చెప్తున్నారు.