Begin typing your search above and press return to search.

ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ ప్రభుత్వ వైన్స్‌ లో ఉద్యోగాలు...

By:  Tupaki Desk   |   9 Aug 2019 12:11 PM GMT
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఏపీ ప్రభుత్వ వైన్స్‌ లో ఉద్యోగాలు...
X
ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వెళుతుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల పోస్టులని భర్తీ చేసిన ప్రభుత్వం, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ వైన్ షాప్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మద్యం షాపులని ప్రభుత్వమే నడపనుంది. అందుకు గాను అందులో పని చేయడానికి అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులని స్వీకరించనుంది.

జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌ద్యం షాపుల‌ను బంద్ చేస్తాన‌ని చెప్పినా... యేడాదికి 20 షాపుల‌ను త‌గ్గించేస్తూ వ‌స్తాన‌ని చెప్ప‌డంతో పాటు అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఇక ఉద్యోగాల క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పట్టణాల్లో ఉండే ఒక్కో వైన్ షాపుల‌లో నలుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు లేదా ముగ్గురు సేల్స్‌ మెన్ ఉంటారు. సూపర్ వైజర్‌ కు రూ.17,500, సేల్స్‌ మెన్‌ కు రూ.15 వేల చొప్పున వేతనాన్ని ఇవ్వనున్నారు. సూపర్‌ వైజర్‌ కు డిగ్రీ, సేల్స్‌ మెన్‌ కు ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించారు. అయితే, ఉద్యోగాలని ఒక ఏడాది కాంట్రాక్ట్ బేసిక్ న ఇవ్వనున్నారని తెలుస్తోంది. యేడాది త‌ర్వాత వీరి ప‌నితీరును, క్ర‌మ‌శిక్ష‌ణ‌ను బ‌ట్టి వీరి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.

ఇక ఉద్యోగులని నియమించేటప్పుడు ప్రభుత్వం వారి దగ్గర నుంచి బాండ్లను స్వీకరించనున్నారు. ఎందుకంటే మద్యం షాపుల్లో నగదు నిల్వలు సిబ్బంది వద్దే ఉంటాయి. అందుకే ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటి ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది.