Begin typing your search above and press return to search.

ఈ అర్హతలు ఉంటేనే భారత్ లో ఉద్యోగాలు..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 12:30 AM GMT
ఈ అర్హతలు ఉంటేనే భారత్ లో ఉద్యోగాలు..!
X
సోషల్ మీడియాలో యుగంలో ఉద్యోగాలు సాధించాలంటే ప్రత్యేక అర్హతలు ఉండాల్సిందే. గతంలో మాదిరిగా ఏదో ఒక డిగ్రీ పట్టా ఉంటే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. చదువుతోపాటు టాలెంట్(స్కిల్స్) ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయని ప్రముఖ సంస్థ లింక్డ్ ఇన్ అధ్యయనంలో వెల్లడైంది.

భారత్ లో ఉద్యోగార్థుల అవసరాలు.. ఇతర ప్రాధాన్యతలపై లింక్డ్ ఇన్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కెరీర్లో అభివృద్ధి.. ఉద్యోగాల్లో మార్పు తప్పనిసరి అని మెజార్టీ ఉద్యోగులు ఈ సర్వేలో వెల్లడించారు. రెండు లేదా మూడు సంవత్సరాలు ఒకే హోదాలో ఉన్న వారితో పొలిస్తే.. ప్రమోషన్స్ వచ్చి వారే అదే సంస్థలో కొనసాగేందుకు పది శాతం ఎక్కువ అవకాశం ఉందని తేలింది.

ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారంతా తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం.. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వంటి వాటిని ఉద్యోగులు కోరుకుంటున్నారు. 2015 తర్వాత దేశంలో ఉద్యోగాలకు కావాల్సిన సిల్క్ విషయంలో చాలా మార్పులు వచ్చాయని వారంటున్నారు.

దీనికి తగ్గట్టుగానే ఉద్యోగాలు స్కిల్స్ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు ప్రస్తుతం 29 శాతం ఉండగా 2025 నాటికి 50శాతం మేరకు పెరిగే అవకాశం ఉందని లింక్డ్ ఇన్ పేర్కొంది. ప్రముఖ కంపెనీలన్నీ కూడా సీనియార్టీ కంటే కూడా స్మార్ట్ వర్క్.. ప్రతిభ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడైంది.

కంపెనీల యజమానులు సైతం ఉద్యోగుల్లో నాలెడ్జ్ షేరింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తోటి సిబ్బందితో సత్సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారని చెప్పారు. ఇది టీం వర్క్ కు చాలా దోహదపడుతుందని లింక్డ్ ఇన్ నివేదికలో వెల్లడయ్యింది. ఏదిఏమైనా భారత్ ఉద్యోగాలు సాధించాలంటే డిగ్రీ పట్టా ఒక్క కంటే సరైన స్కిల్ కూడా తప్పనిసరిగా తేలడంతో యువత ఆవైపు దృష్టి సారిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.