Begin typing your search above and press return to search.

భార్య షాపింగ్ కోసం ఎయిర్ ఫోర్సు వన్ లో ప్రయాణించిన బైడెన్

By:  Tupaki Desk   |   7 Feb 2021 8:00 AM GMT
భార్య షాపింగ్ కోసం ఎయిర్ ఫోర్సు వన్ లో ప్రయాణించిన బైడెన్
X
ప్రపంచంలోని దేశాధ్యక్షులకు లేని సౌకర్యం.. అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉండే ఎయిర్ ఫోర్సు వన్ విమానం. అందులోని సౌకర్యాలు అన్ని ఇన్ని కావు. భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ విమానం..అమెరికా అధ్యక్షుడికే సొంతం. సకల సౌకర్యాలతో.. భూతల స్వర్గంగా ఉండే ఈ విమానాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇన్ని రోజుల తర్వాత తొలిసారి బైడెన్ వినియోగించారు. ఇంతకూ ఆయన తన తొలి ఎయిర్ ఫోర్సువన్ విమాన ప్రయాణం ఎందుకు చేశారో తెలుసా?భార్య షాపింగ్ కు సాయం చేసేందుకు. వినేందుకు కాస్త సిత్రంగా ఉన్నప్పటకి ఇది నిజం.

ఎందుకంటే.. మన దేశంలోని అత్యుత్తమ పదవుల్లో ఉంటే అధినేతలు ఎవరూ కూడా.. భార్యల షాపింప్ కు తోడుగా వెళ్లటం.. సాయంగా ఉండటం లాంటివి అస్సలు కనిపించవు. అలాంటిది ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బైడెన్ మాత్రం.. వైట్ హౌస్ లో ఇంటికి అవసరమైన సామాన్ల కొనుగోలులో భార్యకు సాయం చేసేందుకు ఎయిర్ ఫోర్సు వన్ ను వినిగించారు.

తన ప్రయాణం గొప్ప అనుభూతిని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనకు ప్రత్యేకంగా విమాన సౌకర్యం ఉండేది. కాకుంటే.. దానితో పోలిస్తే.. ఎయిర్ ఫోర్సు వన్ మరింత బాగున్నట్లుగా వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ నుంచి డెలావర్ లోని తన ఇంటికి వెళ్లేందుకు ఈ విమానాన్ని వినియోగించారు. వాస్తవానికి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్ లైన్స్ ప్రకారం కోవిడ్ 19 కారణంగా ప్రయాణాల్ని వీలైనంతగా కుదించారు. ప్రయాణాలు చేయటం ద్వారా వైరస్ వ్యాప్తికి వీలుంటుందని ప్రచారం చేస్తున్నారు. వీలైనంతవరకు ప్రయాణాల్ని చేయకపోవటమే ఉత్తమంగా చెబుతున్నారు.

ఒకవేళ ఎవరైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే.. వ్యాక్సినేషన్ రెండో సారి పూర్తి అయిన తర్వాతే వెళ్లాలని.. అది కూడా సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతే ప్రయాణించాలని చెబుతున్నారు. అయితే.. బైడెన్ మాత్రం మూడు వారాల క్రితమే సెకండ్ డోస్ వేసుకున్నారు. 78ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. హైరిస్కులో ఉన్నప్పటికీ.. ప్రయాణ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. ప్రజలు వీలైనంతవరకు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైట్ హౌస్ పేర్కొంది. అధ్యక్షుల వారి ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు పెద్ద ఎత్తున జర్నీలు పెట్టుకుంటారన్న ముందు జాగ్రత్తలతో ఈ సూచన చేసింది.