Begin typing your search above and press return to search.

ట్రంప్ ఉత్తర్వులు రద్దు చేసిన జో బైడెన్ ... ఏంటంటే ?

By:  Tupaki Desk   |   15 May 2021 10:30 AM GMT
ట్రంప్ ఉత్తర్వులు రద్దు చేసిన జో బైడెన్ ... ఏంటంటే ?
X
అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ , అయన ప్రభుత్వ హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయన తీసుకున్న నిర్ణయాలు అమెరికా సమాజానికి ఎంతమేర ఉపయోగపడ్డాయి అనేది కాసేపు పక్కన పెడితే అమెరికాకి వెళ్లే వలసదారులకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే , ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలుకావడం , జో బైడెన్ అధినేత ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ట్రంప్ తీసుకున్న ఒక్కొక్క వివాదాస్పదమైన ఉత్తర్వులని వెనక్కి తీసుకుంటూ వస్తున్నాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. వైద్య సేవల కోసం అయ్యే ఖర్చును భరించలేని వలసదారులు అమెరికాకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ 2019 ఉత్తర్వులు జారీ చేశాడు. అమెరికాలోకి వచ్చిన వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను తీసుకోవాలని లేదా వైద్య ఖర్చులు భరించే స్తోమత తమకు ఉందని నిరూపించుకోవాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ ఉత్తర్వులు అమెరికా వెళ్లాలనుకునే వలదారులకు ఇబ్బందికరంగా మారాయి. అయితే , తాజాగా జో బైడెన్ ఈ ఉత్తర్వులను రద్దు చేశారు. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్న జో బైడెన్ , అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయలేని వలసదారులపై నిషేధం వధించకుండానే ఆ లక్ష్యం చేరుకోగలమనే నమ్మకం ఉందని బైడెన్ స్పష్టం చేశారు.