Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై లైంగిక ఆరోపణలు..ఖండించిన జోబిడెన్

By:  Tupaki Desk   |   3 May 2020 12:30 AM GMT
అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై లైంగిక ఆరోపణలు..ఖండించిన జోబిడెన్
X
నవంబర్ లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పుడా దేశాన్ని కరోనా కమ్మేసినా కూడా ఎన్నికల వేడి తగ్గడం లేదు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా టైంలోనూ రాజకీయంగా తనకు కలిసి వచ్చే నిర్ణయాలను తీసుకుంటున్నాడు. ఇక ప్రత్యర్థులను ఇరుకునపెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు.

తాజాగా అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ లైంగిక వేధింపుల అంశం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన తారా రీడ్ పై జోబిడెన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణలపై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ స్పందించారు. ఇది నిజం కాదని.. తాను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని ‘ఎంఎస్ఎన్ బీసీ’ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తన జీవితంలో మహిళల ఉన్నతి కోసం.. వారికి సులువుగా ఉద్యోగాలు వచ్చేలా సమాన అవకాశాలు కల్పించేలా పనిచేశానని అన్నారు. ఇంట్లోనే కాదు.. పనిచేసే చోట కూడా మహిళలను వేదించవద్దని పోరాడానని.. ఇప్పటికీ తాను మహిళల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటానని.. వారికి సంపూర్ణ మద్దతు ఇస్తానని బిడెన్ చెప్పారు. తాను అలా ప్రవర్తిస్తే అప్పుడే ఫిర్యాదు రావాలని.. వచ్చిందా తెలుసుకోవాలని అమెరికా సెనెట్ కు సైతం బిడెన్ సూచించారు.

తారా రీడ్ 1992 డిసెంబర్ నుంచి 1993 ఆగస్టు వరకు అమెరికా సెనెట్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ సమయంలో జోబిడెన్ తనను గోడకు వేసి స్కర్ట్ తీసిసి చేతివేళ్లను లోపలికి చొప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తారా ఆరోపించారు.

దీంతో ట్రంప్ కు సరైన పోటీదారుగా భావిస్తూ పైచేయి సాధిస్తున్న జోబిడెన్ డిఫెన్స్ లో పడిపోయారు. ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఇంటా బయటా బిడెన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఈ వివాదం నుంచి బిడెన్ ఎలా బయటపడుతాడో వేచిచూడాలి.