Begin typing your search above and press return to search.
నాడు ట్రంప్.. నేడు బైడెన్ ఒకేలా ఇరుకున్నారు..!
By: Tupaki Desk | 10 Jan 2023 1:09 PM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జనవరిలో మార్ ఎ లాగ్ ఎస్టేట్ లో రహస్య పత్రాలు దాచిన కేసులో ఎఫ్బీఐ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి చెందిన రహస్య పత్రాలు తరలించారని ఎఫ్బీఐకి సమాచారం అందించింది. ఈ మేరకు మార్ ఎ లాగ్ ఎస్టేట్ లోని ఓ గదిలోని పెట్టెలో 67 విశ్వసనీయ.. 92 రహస్య.. 25 అత్యంత రహస్య ప్రతాలు లభించాయి.
ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రంప్ మార్ ఎ లాగో ఎస్టేట్ వ్యవహారంపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెల్సిందే. అయితే జో బైడెన్ సైతం పలు రహస్య పత్రాలు దాచిన కేసులో తాజాగా ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ మద్దతు దారులు బైడెన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఇరకాటంలో పడేస్తున్నారు.
అమెరికా ప్రెసిడెంట్ గా ఒబామా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఆ సమయంలో పెన్సిల్వేనియా విశ్వ విద్యాలయంతో సంబంధాల కోసం ‘ది పెన్న్ బైడెన్ సెంటర్ ఫర్ డిప్లొమసి అండ్ గ్లోబల్ ఎంగేజ్ మెంట్’ కార్యాలయాన్ని వాడుకున్నారు. 2017 నుంచి 2019 మధ్య జో బైడెన్ ఆ విశ్వ విద్యాలయానికి గౌరవ ప్రొఫెసర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడి అటార్ని జనరల్ గార్లాండ్ నవంబర్లో కొన్ని రహస్య ప్రతాలను పెన్న్ బైడెన్ సెంటర్లో కనుగొన్నారు.
డజను కంటే తక్కువ పత్రాలు ఆ గదిలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పత్రాలు అక్కడి ఎలా చేరాయి? వాటిని ఎందుకు వాడుకున్నారన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కాగా అధికారంలో ఉన్న వారు తాము దిగిపోయే సమయంలో రహస్య పత్రాలకు తిరిగి వైట్ హౌస్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ బైడెన్ మాత్రం వాటిని తిరిగివ్వలేదు. ఆయన వీటిని ఎందుకు తిరిగివ్వ లేదనే ప్రశ్నార్థకంగా మారింది.
ఈ విషయంపై బైడెన్ స్పెషల్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్న రిచర్డ్ సౌబర్ స్పందించారు. రహస్య పత్రాలు దొరికిన వ్యవహారంపై ఆర్కైవ్స్ విభాగం.. డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ కు శ్వేతసౌధం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. అధ్యక్షుడి అటర్నీ జనరల్ ది పెన్న్ బెడైన్ సెంటర్లోని ఒక అరలో పత్రాలు సర్దుతున్న సమయంలో రహస్య పత్రాలు దొరకగా వాటిని మర్నాడే వాటిని ఆర్కైవ్స్ విభాగానికి అప్పగించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని షికాగో అటార్నీ జనరల్ జాన్ లాష్ జూనియర్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ట్రంప్ హయంలో నియమించబడ్డారు. అప్పట్లోనే ఆయన నియామకాన్ని సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021లో ఇద్దరు డెమొక్రాట్లు లాష్ ను ఆ పదవిలో కొనసాగించాలని కోరారు. సున్నితమైన దర్యాప్తుకు ఆయన సేవలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం దొరికిన పత్రాలు సెన్సిటివ్ కంపార్ట్ మెంట్ ఇన్ఫర్మేషన్ కేటగిరికి చెందినవిగా గుర్తించారు.
మరోవైపు బైడెన్ మద్దతుదారులు మాత్రం ఈ వ్యవహారాన్ని ట్రంప్ మార్ ఎ లాగో ఎస్టేట్ వ్యవహరంతో పోల్చకూడదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్ ఓవర్ సైట్ చైర్మన్ జేమ్స్ కోమర్ మాట్లాడుతూ ట్రంప్ రహస్య పత్రాలు తీసుకెళ్లినప్పుడు బైడెన్ చాలా విమర్శలు చేశారని కానీ ఇప్పుడు మాత్రం అదే పని చేసి అడ్డంగా దొరికిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.