Begin typing your search above and press return to search.

అమెరికన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జోబెడన్

By:  Tupaki Desk   |   9 July 2022 1:06 PM GMT
అమెరికన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జోబెడన్
X
గర్భస్రావ హక్కులపై ఎన్నో రోజులుగా అమెరికా లో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలకు చెక్ పడేలా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ.. దానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు అవాంచిత గర్భాలు తొలగించకుండా సుప్రీంకోర్టు నిషేధించినట్టైంది. దీనిపై పెద్ద ఎత్తున మహిళల నుంచి నిరసన రావడంతో అబార్షన్ హక్కులను పరిరక్షించే చట్టాన్ని త్వరగా రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు తాజాగా జోబిడెన్ సంచలన సంతకం చేశారు.

రాజ్యాంగ బద్దంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జోబైడెన్ గుడ్ న్యూస్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు.

-గర్భస్రావ నిషేధ చట్టం ఎందుకు అమలైంది.?

50 ఏళ్ల క్రితమే మహిళలకు అబార్షన్ హక్కు కల్పించింది అమెరికా. అయితే అమెరికాలోని అలబామా రాష్ట్రం సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జనాభా పడిపోతోంది. చాలా మంది నవతరం యువత పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు.. డేటింగ్ లు, విడిపోవడాలు చేస్తూ పిల్లలను కనడానికి ముందుకురావడం లేదట. దీంతో అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో పిల్లల జనాభా దారుణంగా పడిపోయింది. ఇది సమతుల్యతను దెబ్బ తీస్తోందని భావించిన అలబామా రాష్ట్ర ప్రభుత్వం‘మహిళల అబార్షన్ ’లపై నిషేధం విధించారు. ఎవరైనా డాక్టర్లు అబార్షన్ లు చేస్తే వారికి 99 ఏళ్ల వరకు శిక్ష విధించాలని నిర్ణయించారు. కేవలం తల్లికి ప్రమాదం ఉందన్న కేసుల్లో మాత్రమే అబార్షన్ చేయాలని సూచించారు. రేప్ బాధితులకు అబార్షన్ చేయరాదని నిబంధన విధించారు. మరో నాలుగు రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. దీన్ని దశల వారీగా అన్ని రాష్ట్రాలు విస్తరిస్తున్నాయి.

-అమెరికాలో మహిళల ఆందోళన

ఆబార్షన్ ల నిషేధంపై మహిళల నుంచి నిరసన వ్యక్తం అవతుండడం విశేషం. అబార్షన్ లను నిషేధిస్తూ చేస్తున్న చట్టాలను మీటూ యాక్టివిస్ట్ లు సినిమా నటీనటులు, హీరోయిన్లు , మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలు పెట్టారు. అలబామా ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ అబార్షన్ ల పై నిషేధాన్ని వ్యతిరేకించారు. ఈ చట్టం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని ఆమె నిరసించారు. 1973లో రూపొందించిన అబార్షన్ ల చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ శరీరాలపై తమకు హక్కులు లేకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా చాలా మంది మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు. వీరంతా కలిసి తాజాగా అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేసే వరకూ సెక్స్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించారు.

-జోబైడెన్ గుడ్ న్యూస్

రాజ్యాంగబద్దంగా లభించిన గర్భస్రావ హక్కును సుప్రీంకోర్టు తీర్పుతో కోల్పోయిన అమెరికన్ మహిళలకు తాజాగా అధ్యక్షుడు జోబైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్ మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

తాజా ఉత్తర్వులతో గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి అక్కడ సేవలను వినియోగించుకునేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజాగా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. ఇక కోర్టులోనూ గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని జోబైడెన్ ఆదేశించారు.

అబార్షన్ పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి.