Begin typing your search above and press return to search.

ఆప్ఘాన్‌ నుండి అమెరికా దళాలు వెనక్కి : జో బైడెన్‌

By:  Tupaki Desk   |   16 April 2021 7:30 AM GMT
ఆప్ఘాన్‌ నుండి అమెరికా దళాలు వెనక్కి : జో బైడెన్‌
X
ఆప్ఘానిస్థాన్ లో హింసకు ముగింపు పలికేందుకు అమెరికా అధినేత జో బైడెన్‌ కట్టుబడి ఉన్నారని ఆమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఆఫ్గాన్‌ నుంచి యూఎస్‌ దళాలను ఉపసంహరించుకోనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 1లోగా ఈ దళాల ఉపసంహరణ జరగుతుంది అని అన్నారు. ప్రస్తుతం ఆప్ఘాన్‌లో 2500 యూఎస్‌ దళాలు ఉన్నాయి. నాటో సంకీర్ణంలో భాగంగా 7 వేల విదేశీ దళాలతో కలిసి పని చేస్తున్నాయి. మే 1 నుంచి దళాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

ఇతర భాగస్వామ్యం దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృందం సూచనల ప్రకారం అఫ్గాన్‌ నుంచి బలగాల ఉపసంహరణపై బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. కాగా, 2001 సెప్టెంబర్‌ 11న యునైటెడ్‌ స్టేట్స్‌ తన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిని చూసింది. ఈ దాడుల్లో మూడు వేల వరకు మరణించారు. కేవలం 102 నిమిషాల వ్యవధిలో ఆల్‌ ఖైదా విమానాలను హైజాక్‌ చేసి కూల్చివేయడంతో న్యూయార్క్‌ వర్డల్‌ ట్రేడ్‌ సెంటర్‌ కు చెందిన రెండు టవర్లు కూలిపోయాయి. అయితే ఉగ్రవాద ముప్పును మాత్రం తేలిగ్గా తీసుకోం.

మా బలగాలు, భాగస్వాములపై తాలిబన్ దాడి జరిగితే ప్రతిస్పందనగా అమెరికా తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించడానికి వెనుకడుగు వెయ్యదు అని బైడెన్ అన్నారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి అఫ్గానిస్థాన్ కు మద్దతు పెంచే విషయాన్ని చర్చిస్తా.. ముఖ్యంగా భారత్ సహా పాక్, రష్యా, చైనా, టర్కీల మద్దతు కోరతా అని అన్నారు. కాగా, అఫ్గానిస్థాన్ లో శాంతి పునరుద్ధరణ ప్రతిపాదనలతో పాటు.. అమెరికన్ దళాల ఉపసంహరణకు ఆరు నెలల జాప్యాన్ని తాలిబన్ తిరస్కరించింది. విదేశీ సైనికులు తమ భూభాగాన్ని వీడేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని తాలిబాన్ సంస్థ ప్రతినిధి మహ్మద్ నయీమ్ వార్డక్ తేల్చిచెప్పారు.