Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసాలు: జోబైడెన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

By:  Tupaki Desk   |   13 March 2021 2:30 AM GMT
హెచ్1బీ వీసాలు: జోబైడెన్ సర్కార్ కీలక ఉత్తర్వులు
X
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న కొత్త అధ్యక్షుడు జోబైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1 బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు మరోసారి బ్రేకులు వేశారు.ఈ మేరకు జోబైడెన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిర్ణయంతో లక్షలాధి మంది విదేశీయులు , ప్రవాసులు లబ్ధి పొందనున్నారు. ప్రవాసులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ హయాంలో హెచ్1బీ విషయంలో ఆంక్షలు విధించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులకు తలుపులు మూసేశారు. అంతేకాదు.. హెచ్1బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల జీతాలను ట్రంప్ అమాంతం పెంచేశారు. తద్వారా సంస్థలు విదేవీ నిపుణులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించలేక.. స్వదేశీ పౌరులకు ఉద్యోగాలిస్తాయని ట్రంప్ అనుకున్నారు.

అయితే ట్రంప్ ఓడి జోబైడెన్ వచ్చాక ఆయన ఇచ్చిన ఆదేశాల అమలుకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం జోబైడెన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ ఆదేశాలను దాదాపు 60 రోజుల వరకు పెండింగ్ లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక హెచ్1బీ వీసాదారుల జీతాల పెంపు అంశంపై ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలు మే 14 వరకు అమలులోకి రాకుండా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ నోటిఫికేషన్ ను జారీ చేశారు.

హెచ్1బీ వీసాలు అత్యధికంగా పొందుతున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. కాగా బైడెన్ సర్కార్ నిర్ణయంతో భారత్, చైనాతోపాటు చాలా దేశాల ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.