Begin typing your search above and press return to search.

బల్బును కనిపెట్టింది ఎడిసన్ కాదు - నల్లజాతీయుడు!!

By:  Tupaki Desk   |   6 Sep 2020 3:51 PM GMT
బల్బును కనిపెట్టింది ఎడిసన్ కాదు - నల్లజాతీయుడు!!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బల్బును కనిపెట్టింది ఓ నల్లజాతీయుడు అని - అంతే తప్ప శ్వేతజాతీయుడైన థామస్ అల్వా ఎడిసన్ కాదని వ్యాఖ్యానించారు. చరిత్రకు సంబంధించిన తరగతుల్లో చరిత్ర పాఠాలు చెప్పడం లేదన్నారు. ఇంకా చాలా ఉందని - ఓక్లహామాలోని బ్లాక్ వాల్ స్ట్రీట్ కాలిపోయిందని - ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా అన్నారు. ప్రజలకు వాస్తవాలు అందించాలన్నారు.

మొదటిసారి బల్బును ఎడిసన్ 1200 గంటలు వెలిగే బల్బును కనుగొన్నారు. ఇంధన శాఖ ప్రకారం ఎడిసన్ 1879, 1880లో పేటెంట్‌ ను పొందాడు. ఇక, బిడెన్... లూయీస్ హోవార్డ్ లాటిమర్‌ను ఉద్దేశించి మాట్లాడి ఉండవచ్చు. ఓ రికార్డు ప్రకారం లైట్ బల్బ్ ఇంప్రూవ్డ్ వర్షన్ పేటెంట్ పొందాడు. ఇది ఎడిసన్ బల్బ్ కంటే ఎక్కువసేపు వెలుగుతుంది. ఆ సమయంలో ఎడిసన్‌తో పోటీ పడుతున్న ఓ సంస్థ కోసం లాటిమర్ పని చేశారని అంటారు.

లాటిమర్ ఓ మాజీ బానిస కొడుకు. యూనియన్ నేవీలో అనుభవం కలిగినవాడు. నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్. అంతేకాదు - ఎడిసన్స్ పయనీర్స్ బృందంలో ఒకే ఒక్క బ్లాక్ మ్యాన్. ఎందుకంటే 1884లో అతను ఎడిసన్‌ తో కలిసి పని చేశారు. అయితే అతను ఒరిజినల్ బల్బ్ సృష్టికర్త కాదంటారు. అంతేకాదు, లాటిమర్ టెలిఫోన్ ఒరిజినల్ సృష్టికర్త అని కూడా కొందరు అంటారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బల్బును కనిపెట్టింది ఓ నల్లజాతీయుడు అని, అంతే తప్ప శ్వేతజాతీయుడైన థామస్ అల్వా ఎడిసన్ కాదని వ్యాఖ్యానించారు. చరిత్రకు సంబంధించిన తరగతుల్లో చరిత్ర పాఠాలు చెప్పడం లేదన్నారు. ఇంకా చాలా ఉందని - ఓక్లహామాలోని బ్లాక్ వాల్ స్ట్రీట్ కాలిపోయిందని - ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా అన్నారు. ప్రజలకు వాస్తవాలు అందించాలన్నారు.

మొదటిసారి బల్బును ఎడిసన్ 1200 గంటలు వెలిగే బల్బును కనుగొన్నారు. ఇంధన శాఖ ప్రకారం ఎడిసన్ 1879 - 1880లో పేటెంట్‌ ను పొందాడు. ఇక, బిడెన్... లూయీస్ హోవార్డ్ లాటిమర్‌ను ఉద్దేశించి మాట్లాడి ఉండవచ్చు. ఓ రికార్డు ప్రకారం లైట్ బల్బ్ ఇంప్రూవ్డ్ వర్షన్ పేటెంట్ పొందాడు. ఇది ఎడిసన్ బల్బ్ కంటే ఎక్కువసేపు వెలుగుతుంది. ఆ సమయంలో ఎడిసన్‌ తో పోటీ పడుతున్న ఓ సంస్థ కోసం లాటిమర్ పని చేశారని అంటారు.

లాటిమర్ ఓ మాజీ బానిస కొడుకు. యూనియన్ నేవీలో అనుభవం కలిగినవాడు. నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్. అంతేకాదు, ఎడిసన్స్ పయనీర్స్ బృందంలో ఒకే ఒక్క బ్లాక్ మ్యాన్. ఎందుకంటే 1884లో అతను ఎడిసన్‌ తో కలిసి పని చేశారు. అయితే అతను ఒరిజినల్ బల్బ్ సృష్టికర్త కాదంటారు. అంతేకాదు, లాటిమర్ టెలిఫోన్ ఒరిజినల్ సృష్టికర్త అని కూడా కొందరు అంటారు.