Begin typing your search above and press return to search.
పాలనపై బైడెన్ సమీక్ష.. మీడియాతో సంచలన నిజాలు..
By: Tupaki Desk | 26 March 2021 12:30 PM GMTజో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను, జీవోలను రద్దు చేశారు. ముఖ్యంగా బైడెన్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల హక్కులను కూడా కాపాడుతున్నారు. దీంతో ఆయనకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు దక్కుతున్నది. ఇదిలా ఉంటే బైడెన్ తన 100 రోజుల పాలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి .. మీరు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీచేస్తారా? అని ప్రశ్నించారు.. దానికి జో బైడెన్ సమాధానం చెబుతూ అందుకు చాలా సమయం ఉందన్నారు.. కానీ పోటీచేసే అవకాశం కూడా ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయనకు 78 ఏళ్లు . వచ్చే ఎన్నికల వరకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందో లేదో వేచి చూడాలి.
ఇటీవల ఓ సమావేశానికి వెళ్లబోతుండగా.. జో బైడెన్ మూడుసార్లు తూలిపడ్డారు కూడా. ఇదిలా ఉంటే తాజాగా తన పాలనపై ఆయన మాట్లాడారు. అయితే ఆయన అధ్యక్షుడయ్యాక తొలిసారి మీడియా ముందుకొచ్చారు జో బైడెన్.. వందరోజుల పాలనలో ఏం చేయబోతున్నారో? మీడియాకు చెప్పారు. తొలి వంద రోజుల పాలన ముగిసే సమయానికి 200 మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జో బైడెన్ తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. రోజూ సగటున రెండున్నర మిలియన్ల మేర వ్యాక్సిన్లను వేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ను 200 మిలియన్ల డోసుల మేర కొనుగోలు చేయనుంది.అలాగే- ఫైజర్, మోడెర్నా నుంచి 600 మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలను పూర్తి చేసింది. దశలవారీగా ఈ వ్యాక్సిన్ అందుతుంది.ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటోంది. 3,07,74,033 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,59,744 మంది మరణించారు.