Begin typing your search above and press return to search.
బైడెన్ గెలిచారు సరే.. ప్రమాణస్వీకారం ఎప్పుడో తెలుసా?
By: Tupaki Desk | 9 Nov 2020 5:45 AM GMTప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అధికార బదిలీ చాలా సంక్లిష్టం. సుదీర్ఘంగా సాగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినంతనే.. మంచి ముహుర్తం చూసుకొని ప్రమాణస్వీకారం చేయటానికి సాధ్యం కాదు. దానికో ప్రాసెస్ ఉంది. డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ గెలుపు శనివారం కన్ఫర్మ్ అయ్యింది. మరి.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేసేదెప్పుడో తెలుసా? వచ్చే ఏడాది జనవరి 20న. నవంబరు ఏడున పలితం వచ్చేస్తే.. దాదాపు పది వారాల తర్వాత ప్రమాణస్వీకారం చేయటమా? అంటే.. అవుననే చెప్పాలి.
ఎందుకంటే.. అమెరికాలో అధ్యక్ష ఎంపిక అంత సుదీర్ఘంగా సాగటమే కారణం. మరిప్పుడు ఏం జరుగుతుంది? అన్న విషయంలోకి వెళితే.. జరగాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. దేశ అధ్యక్ష ఎన్నికలుగా చెప్పినప్పటికి అమెరికన్లు ఎవరు తమ అభ్యర్థిని నేరుగా ఎన్నుకోరు. అంటే..అధ్యక్ష అభ్యర్థికి ఓటువేయటం ఉండదు. వారు తమ రాష్ట్రంలో ఎలక్టార్లను ఎన్నుకుంటారు. వారంతా కలిసి తర్వాత అధ్యక్షులవారిని ఎన్నుకుంటారు.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏదైనా వివాదం చోటుచేసుకుంటే దాన్ని పరిష్కరించుకోవటానికి డిసెంబరు 8 వరకు గడువు ఇస్తారు. ఈ లోపు రీకౌంటింగ్ లాంటి వివాదాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 14న పేపర్ బ్యాలెట్ ద్వారా ఎలక్ట్రార్లు.. అధ్యక్షుల విషయంలో తమ ఎంపిక విషయాన్ని పేర్కొంటూ ఓటేస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 33 రాష్ట్రాల్లో ఎలక్ట్రార్లు పాపులర్ ఓట్లు ఎక్కువగా ఎవరికి వస్తే.. వారికే అధ్యక్ష ఓటు వేయాల్సి ఉంటుందన్న నిబంధన ఉంది.
ఇదంతా జరిగిన తర్వాత జనవరి 6న అమెరికా ఉభయ సభల్ని సమావేశ పరుస్తారు. సెనెట్ అధ్యక్షుడు దేశ ఉపాధ్యక్షుడి ఎంపిక ఫలితాన్ని వెల్లడిస్తారు. 270 ఓట్ల కంటే ఎక్కువగా వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ సభ్యులకు అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ.. ఏ అభ్యర్థికి 270 ఎలక్టోరల్ ఓట్లు రాకుంటే.. రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం అధ్యక్షుడ్ని కాంగ్రెస్ ఎన్నుకుంటుంది. ఇది జరిగిన తర్వాత జనవరి 20న అధ్యక్షుడిగా ఎంపికైన వారు.. అధికారికంగా ప్రమాణస్వీకారం చేసి.. బాధ్యతల్ని స్వీకరిస్తారు. దీంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇదంతా జరగాలి కాబట్టే.. నవంబరు మొదటి వారంలో పలితాలు వెలువడినా.. ప్రమాణస్వీకారం చేయటానికి జనవరి మూడో వారం వరకు వెయిట్ చేయక తప్పదు.