Begin typing your search above and press return to search.
పాపం రాజస్థాన్ రాయల్స్.. జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ కు దూరం..!
By: Tupaki Desk | 24 April 2021 2:30 PM GMTఐపీఎల్లో పటిష్ఠమైన బౌలింగ్, బ్యాటింగ్ ఉన్న జట్లు కూడా కీలక సమయాల్లో తడబడుతూ ఉంటాయి. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రాదు. ఎంతో పటిష్ఠమైన ముంబై జట్టు ఈ సారి పెద్దగా రాణించడం లేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ ను దురదృష్టం వెంటాడుతోంది. గెలుస్తామనుకున్న మ్యాచ్ లు చివరి నిమిషంలో చేజారుతున్నాయి.
ఇదిలా ఉంటే వివిధ కారణాలతో .. కీలక ఆటగాళ్లు సైతం ఆ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నారు. ఆర్ ఆర్ ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం అవుతోంది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వేలి గాయం కారణంగా ఐపీఎల్నుంచి తప్పుకున్నాడు. ఇది ఆర్ఆర్ కు పెద్ద దెబ్బ. లైమ్ లివింగ్ స్టోన్ కూడా ఆరోగ్య కారణాలతో జట్టుకు ఆడటం లేదు. ఈ సారి ఆర్ఆర్ కు కీలక బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇంతవరకు ఒక్కమ్యాచ్ ఆడలేదు. ఆర్చర్ ప్రపంచ ప్రఖ్యాత బౌలర్. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటూ ఉంటాడు.
ఆర్చర్ కూడా అనారోగ్యంతో మొదట జట్టుకు ఆడలేదు. అయితే టోర్నమెంట్ చివరి మ్యాచ్ లలోనైనా అతడు వస్తాడని ఆర్ ఆర్ యాజమాన్యం చెప్పింది. ఆర్ఆర్ ఫ్యాన్స్ కూడా ఆర్చర్ కోసం ఎదురు చూశారు.అయితే ఆర్చర్ ఈ ఐపీఎల్ కు రాకపోవచ్చని సమాచారం. ఆర్చర్ ఇటీవలే వేలుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతడికి మరికొంత కాలం రెస్ట్ అవసరమని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఇసిబి) తెలిపింది.
అంతేకాక విశ్రాంతి పూర్తి అయ్యాక .. అతడు కొంత కాలం శిక్షణ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాతే ఆర్చర్ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అంటే ఈ ఐపీఎల్లో ఆర్చర్ ఇక ఆడకపోవచ్చు. దీంతో ఆర్ ఆర్ కొత్త విదేశీ ఆటగాళ్ల కోసం వెదుకుతున్నది. ఒకవేళ ఎవరినైనా తీసుకొచ్చినా వాళ్లను 15 రోజులు క్వారంటైన్లో ఉంచాల్సి వస్తుంది. దీంతో ఆర్ ఆర్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆ జట్టు ఇప్పటికే సరైన బౌలర్లు లేక తడబడుతున్నది. ఆర్చర్ కూడా వచ్చే అవకాశం లేదు.మరోవైపు పాయింట్ల పట్టికలో ఆర్ ఆర్ ఆఖరున ఉంది. ఇలాగే ఆడితే ప్లే ఆప్స్ కు వెళ్లడం చాలా కష్టం. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆర్ఆర్ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది.