Begin typing your search above and press return to search.
సండే సాయంత్రం నుంచి బాబు షాక్ లో ఉన్నారట
By: Tupaki Desk | 10 July 2017 9:44 AM GMTరెండు రోజులు పాటు సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పుణ్యమా అని ఏపీ రాజకీయాలు అమాంతం హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వాడీవేడిగా అధికార.. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నారు. జగన్ పార్టీ ప్లీనరీపై అధికారపక్ష మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే.. తాము మాత్రం ఏమీ తక్కువ తినలేదంటూ మరింత ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. మాటకు మాట అన్నట్లు ఫైర్ అవుతున్నారు.
తాజాగా జగన్ పార్టీ నేత జోగి రమేశ్ వ్యాఖ్యలు చూస్తే.. అధికారపక్ష నేతలపై విపక్ష నేతలు ఏ రేంజ్లో విరుచుకుపడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ చూశాక.. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్ముకున్నాయన్నారు. బాబు షాక్ లోకి వెళితే.. ఆయన మంత్రివర్గ సభ్యులంతా కూడా మూర్ఛరోగుల్లా మారిపోయారని.. పిచ్చి ప్రేలాపనలు మాని ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే వ్యాధి నయం అవుతుందని దుయ్యబట్టారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని చంద్రబాబు అమలు చేయలేదని ధ్వజమెత్తిన ఆయన రైతులు.. అక్కా చెల్లెళ్లు.. యువత.. నిరుద్యోగులు.. బీసీలు.. ఎస్సీలు ఇలా చెప్పుకుంటూ పోతే అందరిని చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు. తమ పార్టీకి తద్దినం పెడతారని మంత్రి దేవినేని ఉమ అంటున్నారని.. ఆయనకే మైలవరంలో తద్దినం పెట్టటం ఖాయమని.. అతి త్వరలోనే టీడీపీని.. ఆ పార్టీ నేతల్ని శ్మశానానికి పంపిస్తామంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్లీనరీతో రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల భవిష్యత్తు ఎంత బాగుంటుందన్న విషయాన్ని జగన్ చాలా వివరంగా చెప్పారని.. దేశంలో ఎక్కడా కూడా ఇంత చక్కగా ప్లీనరీ నిర్వహించలేదన్నారు. మీడియా కూడా ఆశ్చర్యపోయిందన్న ఆయన.. ప్లీనరీని చూసిన లోకేశ్ షాక్ లోకి వెళ్లి హెరిటేజ్ పాలు తాగుతున్నారని ఎద్దేవా చేశారు.