Begin typing your search above and press return to search.
జోగికి వెంకట గౌడతో ఇబ్బందేనా ? టార్గెట్ రీచ్ అయినట్లేనా ?
By: Tupaki Desk | 22 May 2021 3:30 PM GMTఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు టాపిక్ బాగా వేడెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజుగారు, జగన్ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే సడన్‌గా రాజుగారిని అసెంబ్లీ సాక్షిగా పచ్చి బూతులు తిట్టిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ హైలైట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాయకులు బూతులు మాట్లాడటం సహజమైంది. మీడియా సమావేశాల్లో ఇదంతా సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల బూతుల పర్వానికి అడ్డు లేకుండా పోయింది.
అయితే ఇప్పటివరకు బయటకే పరిమితమైన బూతులు, అసెంబ్లీలో కూడా వినిపించాయి. తాజాగా బడ్జెట్ సమావేశాలు సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, రఘురామకృష్ణంరాజుపై ఫైర్ అయ్యారు. ఊహించని విధంగా జోగి బూతులు మాట్లాడేశారు. ఇక మాట్లాడిని కాసేపటికి తెరుకుని, అసెంబ్లీలో ఇలా మాట్లాడకూడదని, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలని, తాను మాట్లాడిన మాటలని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ని కోరారు. అయితే ఈరోజుల్లో అంతా లైవ్‌లో వెళ్లిపోతుంది. అలాంటప్పుడు రికార్డుల్లో తొలగించడమనే విషయం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా జోగి మాటలను సీఎం జగన్ కూడా సమర్థించారు.
అయితే జోగి ఈ స్థాయిలో మాట్లాడటానికి కారణాలు లేకపోలేదన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేయాలని జోగి చూస్తున్నారు. అందుకే జగన్‌ని మెప్పించాలనే జోగి అలా మాట్లాడారని వైసీపీలోనే చర్చలు నడుస్తున్నాయి. పైగా తన సామాజికవర్గానికి చెందిన పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వెంకట గౌడ కంటే జోగి సీనియర్ అయినా కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణలు ఆయన మంత్రి పదవికి అడ్డుగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే జోగి హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో రాజుగారిని టార్గెట్ చేసి బూతులు మాట్లాడి, జగన్ దృష్టిలో పడటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జోగి బూతులు మాట్లాడినా సరే జగన్ మందలించలేదు. పైగా తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగారు అని కంగ్రాట్స్ కూడా చెప్పారు. అలాగే తన మీద ఉన్న ఆప్యాయతతోనే అలా మాట్లాడారని, అందుకే జోగికి జగన్ థాంక్స్ కూడా చెప్పారు. ఈ పరిస్థితిని చూస్తే జోగి, జగన్‌ని ఇంప్రెస్ చేసినట్లే కనిపిస్తోంది. ఈ ఇంప్రెస్ సంగతి ఎలా ఉన్నా జోగి మంత్రి కోరిక నెరవేరుతుందో ? లేదో ? చూడాలి.