Begin typing your search above and press return to search.
కేసీఆర్ కుటుంబం నుంచి ఇంకో వారసుడు
By: Tupaki Desk | 15 April 2017 5:18 AM GMTజోగినపల్లి సంతోష్ రావు. రాజకీయాలను సాధారణంగా చూసే వారికి ఈ పేరు పెద్దగా తెలియదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అవగాహన ఉన్న వారికి మాత్రం ఈ పేరు గురించి చాలా స్పష్టత ఉంటుంది. సీఎం కేసీఆర్ దగ్గర పార్టీ - ప్రభుత్వ పరమైన నిర్ణయాలను `ప్రభావితం` చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరకాలంటే సంప్రదించాల్సింది జోగినపల్లి సంతోష్ రావునే. అంత పట్టు సీఎం దగ్గర ఉందన్నమాట. త్వరలోనే ఆయన్ను కేసీఆర్ కుటుంబం నుంచి వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎందుకు కేసీఆర్ కుటుంబం నుంచి అంటే...ఈయన స్వయానా కేసీఆర్ మరదలి కొడుకు. సంతోష్ ఎంట్రీ కోసం ఇప్పటికే నియోజకవర్గం కూడా ఖరారు అయిందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఏ పని జరగాలన్నా, ఏ ఫైలు కదలాలన్నా..సంతోష్ కీలకమని ప్రచారంలో ఉంది. ఒక విధంగా ఆయనే సీఎంకు ఆంతరంగిక ప్రయివేటు కార్యదర్శి. దీనికి కారణం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో హరీశ్ రావు అన్నీ తానై నడిపించారు. కేసీఆర్ అదే సమయంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. రెండు చోట్ల గెలుపొందడంతో ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హరీశ్ రావు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన స్థానాన్ని సంతోష్ భర్తీ చేస్తున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ తన పదవులకు రాజీనామా చేసి ఎన్నికల కదనరంగంలోకి దూకిన ప్రతిసారీ సంతోష్ ఆయన వెన్నంటే ఉన్నారు. అయతే సీఎంకు సన్నిహితంగా ఉన్నప్పటికీ తనకూ ఓ గుర్తింపు కావాలనే కోరిక సంతోష్ లో మొదలైందని అంటున్నారు. తన మనుసులోని మాటను పెద్దనాన్న కేసీఆర్ చెవిలో వేసినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా తనకు రాజకీయ ఎంట్రీకి వేములవాడ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది.
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ బాబు వరుసగా అక్కడ మూడుసార్లు గెలుపొందారు. ఆయనకు అక్కడ మంచి పట్టుంది. కానీ, ద్వంద్వ పౌరసత్వం కేసు ఆయనకు సమస్యగా మారింది. ఇప్పటికే ఆయన ఆరు నెలలు జర్మనీలో, మరో ఆరునెలలు ఇక్కడ ఉంటున్నారు. దీంతో ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారమూ పెరిగింది. దీనికి అనారోగ్య సమస్యా తోడైంది. రెండేళ్ల అనంతరం వచ్చే ఎన్నికల్లో ఆయన ఊరురా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ నియోజకవర్గంపై పట్టుకోసం దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా టీఆర్ ఎస్ కు బలమైన నాయకత్వం కనిపించట్లేదు. రమేష్ బాబును కాదనుకుంటే సంతోష్ ఉత్తమమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయన ఎంట్రీకి రంగం సిద్ధమైందని చెప్తున్నారు. కాగా, స్థానికత ఆధారంగా చూస్తే...రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని కొదురుపాక గ్రామం సంతోష్‌ది. ఇప్పుడు ఆ మండలం చొప్పదండి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలం వేములవాడ నియోజకవర్గంలో కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్ బాబు వేములవాడ నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇప్పటికే ముగ్గురు రాజకీయ వారసులు ఉన్న కేసీఆర్ కుటుంబంలో మరో నాయకుడు రావడం ఖాయం అయిందన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/