Begin typing your search above and press return to search.
బ్రిటన్ పార్లమెంట్ చేతిలో ట్రంప్ కు భారీ షాక్
By: Tupaki Desk | 7 Feb 2017 3:13 PM GMTప్రపంచానికి పెద్దన్న హోదాలో వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు ఒక దేశానికి వెళుతున్నారంటే.. ఆ దేశంలో జరిగే ఏర్పాట్లు ఒక స్థాయిలో ఉంటాయి. ప్రపంచ పెద్దన్న తమ దేశానికి రావటానికి భారీ ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. అత్యంత గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తాయి. అతిధి సత్కారాలతో అధ్యక్షుడి మనసును దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. తాజాగా అందుకు రివర్స్ గా మారింది సీన్.
అమెరికా అధ్యక్ష కుర్చీలో కూర్చున్న ట్రంప్ కారణంగా బ్రిటన్ పార్లమెంటు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలో బ్రిటన్ లో పర్యటించనున్న ట్రంప్ ను.. బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించటానికి అనుమతించే అవకాశమే లేదని తేల్చి చెప్పటమే కాదు.. ఈ నిర్ణయాన్ని సభ్యులంతా హర్షాతిరేకాలు ప్రదర్శిస్తున్న వేళ తీసుకోవటం గమనార్హం.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. ట్రంప్ ను తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. పొగరబోతు ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు.. ఏడు ముస్లిం మెజార్టీ దేశాల ప్రజల్ని అమెరికాకు రావటాన్ని బ్యాన్ చేయటంపై ప్రపంచంతో పాటు బ్రిటన్ లోని వారంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. ట్రంప్ రాక ఓకే అయినా.. అలాంటి నేతను పవిత్రమైన పార్లమెంటులో ప్రసంగించే అవకాశం ఎంతమాత్రం ఇవ్వకూడదంటూ ఆన్ లైన్ పిటీషన్ లో 20 లక్షల మంది సంతకాలు చేశారు. దీంతో.. ఈ అంశాన్ని తాజాగా పార్లమెంటులో చర్చించారు. సభ్యులంతా ట్రంప్ ను పార్లమెంటులో ప్రసంగించేందుకు ఎంతమాత్రం అనుమతించొద్దని కోరటం.. అదే విషయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో తేల్చేశారు. ఆయనీ నిర్ణయాన్ని వెల్లడించే సందర్భంలో సభ్యులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం గమనార్హం.
ట్రంప్ చూపిస్తున్న జాతి వివక్షతో పాటు.. ఆయనపై ఉన్న లైంగిక వేధింపు ఆరోపణల నేపథ్యంలో ఆయన్నుపార్లమెంటులో ప్రసంగించేందుకు అనుమతించలేమని స్పీకర్ తేల్చేశారు. అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాల్ని తాము గౌరవిస్తామంటూనే.. జాతి వివక్ష.. లైంగిక వేధింపుల్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని.. చట్టం.. న్యాయం ముందు అందరూ సమానమని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ఒక వ్యక్తి తనకు అత్యంత సన్నిహితమైన ఒక అగ్రరాజ్యం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవటం షాకింగేనని చెప్పాలి. ట్రంప్ కు ఇంతకు మించిన భారీ అవమానం మరొకటి ఉందన్న మాట వినిపిస్తోంది. బ్రిటన్ పార్లమెంటు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వెళతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెళితే.. ఉడుకుపోతు ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/