Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను కెలికి సారీ చెప్పిన హాలీవుడ్ స్టార్‌

By:  Tupaki Desk   |   25 Jun 2017 7:19 AM GMT
ట్రంప్‌ ను కెలికి సారీ చెప్పిన హాలీవుడ్ స్టార్‌
X
మ‌నసులోని భావాల్ని వ్య‌క్తం చేసే విష‌యంలో గ‌తంలో కాస్త వెనుకా ముందు చూసుకునే వారు. డిజిట‌ల్ యుగం స్పీడ్‌కు త‌గ్గ‌ట్లే ప్ర‌ముఖుల తీరులోనూ మార్పులు వ‌చ్చాయా? అంటే అవున‌న్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ప్ర‌ముఖులు వివాదాల్లోకి కూరుకుపోతున్నారు. త‌మ నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట‌ను అనేస్తున్నారు. త‌ర్వాతి వ‌చ్చే ప‌రిణామాల గురించి అస్స‌లు ఆలోచించ‌టం లేదు.

నోరు జారేసి.. ఆ త‌ర్వాత చోటు చేసుకుంటున్న రియాక్ష‌న్ తో బుద్దిగా చెంప‌లేసుకుంటూ సారీలు చెబుతున్నారు. తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జానీ డెప్‌. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప‌డ‌ని ఆయ‌న‌.. ఇటీవ‌ల నోరు జారేసి పెద్ద మాటే అనేశారు. ట్రంప్‌ను హ‌త్య చేయాలంటూ డెప్ చేసిన ప‌రోక్ష వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది.

పైరేట్స్ ఆఫ్ ద క‌రీబియ‌న్ ఫేం జానీ డెప్ ఇంగ్లండ్‌ లో జ‌రుగుతున్న గ్లాస్టోన్ బ‌రీ ఫెస్టివ‌ల్‌ కు వెళ్లాడు. అక్క‌డ మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడ్ని హ‌త్య చేయాల‌న్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు జాన్‌.ఎఫ్. కెన్న‌డీని హ‌త్య చేసిన న‌టుడు ఎవ‌రు? అంటూ అప్పుడెప్పుడో 1865లో హ‌త్య చేసిన హాలీవుడ్ న‌టుడు జాన్ బూత్‌ ని గుర్తు చేశారు. దీంతో.. ఇత‌గాడి మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

దీనిపై వైట్ హౌస్ వెంట‌నే స్పందించింది. అధ్య‌క్షుల వారిని అంత మాట అంటారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీంతో.. విష‌యం అర్థ‌మైన జానీ డెప్ తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు చెంప‌లేసుకున్నారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన వ్యాఖ్య కాద‌ని.. హాని చేయాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేద‌ని.. అభిమానుల్ని సంతోష‌పెట్టాల‌న్న ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. ఎంత అభిమానుల్ని సంతోష‌పెట్ట‌టానికైనా.. అత్యున్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తిని హ‌త్య చేయాల‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తారా?

నోటి దూల‌తో ట్రంప్‌ ను కెలికి మ‌రీ.. సారీ అంటూ చెంప‌లేసుకున్న ఈ హీరో గారు ఇప్పుడైతే జీరో అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/