Begin typing your search above and press return to search.
కార్ల అమ్మకాలు బాగాలేవని సూసైడ్ చేసుకుందట!
By: Tupaki Desk | 13 Sep 2019 5:15 AM GMTకార్ల డీలర్ షిప్ అంటే మాటలా? దాని కోసం ఎంత పోటీ ఉంటుంది? కేంద్రంలో పలుకుబడి ఉన్న వ్యాపార కుటుంబాలకు మాత్రమే దక్కే కార్ల డీలర్ షిప్ లు ఒక మోస్తరు వ్యాపారస్తుల చేతికి రానే రావు. ఇక.. టొయోటా లాంటి పెద్ద కంపెనీల డీలర్ షిప్ లు సొంతం చేసుకోవటానికి భారీ కసరత్తు చేయక తప్పదు. అలాంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఒకరు సూసైడ్ చేసుకున్న ఉదంతం చెన్నైలో చోటు చేసుకొని కలకలం రేపుతోంది.
ప్రముఖ మహిళా వ్యాపారవేత్త.. చెన్నైలోని లాన్సన్ టొయోటా డీలర్ షిప్ ఉన్న యాభై ఏళ్ల రీటా లంకలింగం తాజాగా సూసైడ్ చేసుకోవటం కలకలం రేపుతోంది. విరుచుకుపడుతున్న ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కార్ల అమ్మకాల మీద పడటంతో.. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన నుంగంబాక్కం కొథారీ రోడ్డులో లంక లింగం.. రీటా దంపతులు ఉంటున్నారు.
లంకలింగం అల్లాటప్పా వ్యాపారవేత్త కాదు. తమిళనాడులోని టొయోటా కార్ల డీలర్ గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్ అయితే.. రీటా జాయింట్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశవ్యాప్తంగా శాఖల్ని విస్తరిస్తూ దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో రీటా తన పడకగదిలో సూసైడ్ చేసుకోవటం సంచలనంగా మారింది. బుధవారం రాత్రి తన రూంలోకి వెళ్లి పడుకున్న ఆమె.. గురువారం ఉదయం 11 గంటల వరకూ బయటకురాకపోవటం.. గదిలో ఎలాంటి అలికిడి లేకపోవటంతో పనిమనిషికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో.. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. గది తలుపులు బద్దలు కొట్టి చూడగా..రీటా ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న వైనం కనిపించింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో కార్ల అమ్మకాలు తగ్గిపోయి.. నష్టాలు ఏర్పడటంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు. అయితే.. వ్యాపారనష్టాలు కావు.. ఇంట్లో గొడవలతోనే ఆమె సూసైడ ముడిపడి ఉందన్న మాట వినిపిస్తోంది. అన్నికోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.