Begin typing your search above and press return to search.

కింగ్ లేడు.. ఫిష్ లు ఎండిపోతున్నాయి!

By:  Tupaki Desk   |   29 Sep 2016 10:29 AM GMT
కింగ్ లేడు.. ఫిష్ లు ఎండిపోతున్నాయి!
X
ఆయన లేడు... అందాలు ఎదురుచూస్తున్నాయి! ఆయ‌న లేడు... అంద‌గ‌త్తెల క‌ళ్లు కాయ‌లు కాస్తున్నాయి! ఆయ‌న లేడు... అప్పులు పెరిగిపోతున్నాయి! ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారు... విజ‌య్ మాల్యా. ప్ర‌తీ ఏడాది స‌రిగ్గా ఈ సీజ‌న్ వ‌చ్చేస‌రికి మాల్యా కాంపౌండ్ లో అంద‌గ‌త్తెల సంద‌డి ఉండేది. బీచుల్లో బికీనీలు వేసుకుని కెరటాల‌ను రెచ్చ‌గొట్టే అందాల మ‌ధ్య ఎగ‌సిప‌డుతున్న సౌంద‌ర్య రాశుల సంద‌డి ఉండేది. ఆ సుంద‌రీమ‌ణుల మ‌ధ్య మోడ‌ర‌న్ మ‌న్మ‌థుడిలా తిరుగుతూ విజ‌య్ మాల్యా క‌నిపించేవారు. ప్ర‌తీయేటా జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యే కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ ఎంత ఫ్యామ‌సో అంద‌రికీ తెలిసిందే. ఆ క్యాలెండ‌ర్ త‌మ అందాల‌ను ఆర‌బోయ‌డం కోసం మోడ‌ల్స్ పోటీ ప‌డుతూ ఉంటారు. ఈ పాటికి మీడియాలో కింగ్ ఫిష‌ర్ భామ‌లు సంద‌డి మొద‌లైపోయేది. కానీ, ఈ ఏడాది ఆ సంద‌డే లేదు - ఆ అందాలే లేవు - ఆ ఆర‌బోతూ లేవు. ఎందుకంటే, ఆయ‌నే లేరు క‌దా! పాపం... బ్యాంకులు బెదిరిస్తున్నాయ‌ని భ‌య‌ప‌డి విదేశాల‌కు వెళ్లిపోయారు. ఆయ‌న లేక‌పోతే కెర‌టాలు ఏమైపోతాయి..? బీచుల్లో అందాల‌ను ఎవ‌రు ఆరాధిస్తారు..?

ప్ర‌తీయేటా వ‌చ్చే కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ వచ్చే ఏడాది వ‌స్తోందో రాదో అని సౌంద‌ర్య పిపాస‌కులు ఆందోళ‌న చెందుతున్నారు! మ‌రో మూడు నెల‌ల్లో కొత్త సంవ‌త్సరం రాబోతోంది.. కాబ‌ట్టి, ఇప్పుడు ఆ క్యాలండ‌ర్ గురించి ర‌క‌రకాల కామెంట్లు సోష‌ల్ మీడియాలో పేలుతున్నాయి. కొత్త క్యాలెండ‌ర్ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే... 2016 క్యాలెండ‌ర్ లో అందాలు ఆర‌బోసిన అమ్మాయిల‌కు పూర్తిగా పారితోషికాలు కూడా ఇవ్వ‌లేద‌ట‌! దాంతో వాళ్లంతా మాల్యా మీద బెంగెట్టేసుకుని - తిండీ తిప్ప‌లూ మానేసి - నిద్రాహారం మ‌ర‌చిపోయి బ‌క్క‌చిక్కిపోయి ‘వస్తాడు నా రాజు ఏదో ఒక రోజు’ అని ఆశ‌గా చిక్కి శ‌ల్య‌మై ఎదురుచూస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంతేకాదు - కొంత‌మంది బ‌క్క‌చిక్కిన అమ్మాయిల బికినీ ఫోజులు పోస్ట్ చేసి... మాల్యా కోసం మా ఎదురుచూపు అన్న‌ట్టుగా ఔత్సాహిక నెటిజ‌న్లు ట్యాగ్ లైన్లు పెట్టేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/