Begin typing your search above and press return to search.
నెపోలియన్ తొలి భార్య ప్రేమలేఖ ఎన్ని కోట్లంటే....
By: Tupaki Desk | 11 Aug 2019 6:42 PM GMTపురాతన వస్తువుల్ని దక్కించుకోవటానికి కొంతమంది చాలా ఆసక్తి చూపుతారు. అత్యంత అరుదైనవి కావడంతో వాటి కోసం కోట్లు ఖర్చు పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే పురాతన వస్తువులు - ప్రాచీన కళాఖండాలు వేలం వేసేటప్పుడు భారీ ధరకు అమ్ముడవుతాయి. తాజాగా 200 సంవత్సరాల నాటి ఓ ప్రముఖ రాజు తన తొలి భార్యకు రాసిన ప్రేమలేక భారీ రేటుకు అమ్ముడుపోయింది.
ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ గురించి తెలియని వారు ఉండరు. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన నెపోలియన్ గురించి - ఆయన మనస్తత్వం గురించి ప్రపంచ చరిత్రకారులకు సైతం అంతుపట్టదు. ఎందుకంటే ఓ సామన్య సైనికుడిగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సైన్యాధ్యక్షుడు అవ్వడంతో పాటు చివరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యాడు. మధ్యలో ఓ సారి ఆయన్ను ఎల్బా దీవిలో బందించినా తప్పించుకుని తిరిగి వచ్చి మళ్లీ ఫ్రాన్స్ అధ్యక్షుడు అవ్వడం నెపోలియన్ కే చెల్లింది.
ఇక గురువారం ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో జరిగిన ఈ వేలంలో నెపోలియన్ తన తొలి భార్యకు రాసిన 200 ఏళ్ల అత్యంత పురాతన ప్రేమలేఖ 5,13,000 యూరోలకు వేలంలో అమ్ముడుపోయింది. ఇది ఇండియా కరెన్సీలో రూ. 3. కోట్ల 97 కోట్లు. అంటే దాదాపుగా రూ.4 కోట్లు. నెపోలియన్ బోనపార్టీ తన తొలి భార్య జోసెఫిన్‌కు ఈ లేఖ రాశారు. 1796- 1804 మధ్య కాలంలో ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.
ఈ లేఖలో నెపోలియన్‌కు తన భార్యపై అపారమైన ప్రేమ చెపుతోంది. జోసెఫిన్ గురించి నెపోలియన్ ఫ్రెంచ్ భాషలో నా ప్రియ మిత్రమా మీ నుంచి నాకు ఎలాంటి లేఖ రాలేదు... మీరు ముఖ్యమైన పనిలో ఉన్నట్టు ఉన్నారు. అందుకే నన్ను మరిచిపోయారు... ఇప్పుడు నేను అలసటతో ఉండడంతో మీరే నాకు గుర్తుకు వస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నాడు.
ఇక 1796లో నెపోలియన్ కు 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 26 ఏళ్ల వితంతువు, ఇద్దరు పిల్లల తల్లి అయిన జోసెఫిన్‌ను పెళ్లాడాడు. ఆ తర్వాత 1810లో ఆమెకు విడాకులు ఇచ్చినా... జీవితాంతం ఆమెపై ప్రేమతోనే ఉండేవాడు. జెసెఫిన్‌కు విడాకులు ఇచ్చాక నెపోలియన్ ఆస్ట్రియాకు చెందిన మేరీ లూయిస్‌ను రెండో వివాహం చేసుకున్నారు. చివరకు 1821 మే 5 తన 51 సంవత్సరాల వయస్సులో మరణించేటప్పుడు కూడా తన తొలి భార్య పేరునే స్మరించాడట.