Begin typing your search above and press return to search.

ఏపీసీసీకి జోష్: మాజీ సీఎంకు కీలక పదవి

By:  Tupaki Desk   |   22 Feb 2020 7:24 AM GMT
ఏపీసీసీకి జోష్: మాజీ సీఎంకు కీలక పదవి
X
రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడిని మార్చగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నియామకాలు చేపట్టారు. 2024లో పార్టీకి పునర్వైభవం కోసం చర్యలు చేపట్టింది. ఇటీవల ఏపీ పీసీసీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన విషయం తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆఫీస్ బేరర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీకి 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఓ జాబితా విడుదల చేసింది.

29 మందితో సమన్వయ కమిటీ, మరో 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీను ఏర్పాటుచేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా పీసీసీ చీఫ్, సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు కమిటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం కల్పించడం విశేషం. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులతో ఆఫీస్‌ బేరర్ల జాబితాను ప్రకటించింది. సమన్వయ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీల నియామకంతో పాటు అన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం ఢిల్లీలో ఉత్తర్వులు జారీ చేశారు.

సమన్వయ కమిటీ
రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ చైర్మన్‌గా 25 మంది నేతలతో సమన్వయ కమిటీని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు టి. సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీడీ మెయ్యప్పన్‌, క్రిస్టోఫర్‌ తిలక్‌, కొప్పుల రాజు, ఎం.ఎం.పళ్లంరాజు, సాయిప్రతాప్‌, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, చింతా మోహన్‌, తులసిరెడ్డి, షేక్‌ మస్తాన్‌వలీ, గిడుగు రుద్రరాజు, శ్రీవెళ్ల ప్రసాద్‌, సీవీ శేషారెడ్డి, లింగంశెట్టి ఈశ్వరరావు, ఎం.జె.సూర్యనాయక్‌, పి.కమలమ్మ, ఎం.జె.రత్నకుమార్‌, సుంకర పద్మశ్రీ, కేబీఆర్‌ నాయుడు.

రాజకీయ వ్యవహారాల కమిటీ
12 మందితో ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ చైర్మన్‌గా ఉంటారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పళ్ల్లంరాజు, కొప్పుల రాజు, చింతా మోహన్‌, తులసిరెడ్డి, మస్తాన్‌వలీ, జంగా గౌతమ్‌, కొరివి వినయ్‌కుమార్‌, సాజహాన్‌ బాషా, పి.రమణకుమారి సభ్యులు. ఉపాధ్యక్షులుగా షాజహాన్‌ బాషా, జంగా గౌతమ్‌, యడ్ల ఆదిరాజు, ఎస్‌.ఎన్‌.రాజా, శృతీదేవి, మార్టిన్‌ లూథర్‌, గంగాధర్‌, మురళి ధనేకుల, వేణుగోపాల్‌రెడ్డి, జె.ప్రభాకర్‌, శ్రీపతి ప్రకాశరావు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా డోలా జగన్మోహన్‌, జమ్ము ఆదినారాయణ, జి.నారాయణ రావు, పాచిపెంట శాంతకుమారి, బొడ్డుముచ్చి శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, అమర్జాహ్‌ బేగ్‌ మహమ్మద్‌, పి.హరికుమార్‌ రాజు, పరసా రాజీవ్‌ రతన్‌, గార ఉషారాణి, చిలకా విజయ్‌కుమార్‌, చెరువు శ్రీధర్‌రెడ్డి, వై.సుమతిరెడ్డి, చింతల మోహన్‌రావు, జగన్మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణన్‌, మదనమోహన్‌రెడ్డి, .రాంభూపాల్‌రెడ్డి
నియమితులయ్యారు.

ఉనికి కోల్పోయిన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కల్పించేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఈ నియామకాలతో పార్టీ కేడర్ కు కొంత ఉత్సాహం వచ్చినట్టుంది. 2014లో ఘోర పరాభయం తర్వాత, 2019 ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. దీన్నుంచి బయటపడి 2024లో ప్రభావం చూపే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.