Begin typing your search above and press return to search.

ఆ సీఎంకు మించినోడు ఈ యూపీ మంత్రి

By:  Tupaki Desk   |   31 May 2018 9:45 AM GMT
ఆ సీఎంకు మించినోడు ఈ యూపీ మంత్రి
X
పురాణాల్లోని అంశాల్ని ఇవాల్టి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు పోల్చి మాట్లాడ‌టంలో బీజేపీ నేత‌ల‌కు ఉన్నంత నేర్పు మ‌రెవ‌రికీ ఉండ‌ద‌నే చెప్పాలి. ఆ మ‌ధ్య‌న త్రిపుర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విప్ల‌వ్ కుమార్ అనే పెద్ద మ‌నిషి.. అదే ప‌నిగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. చేసి.. వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిల‌వ‌టం తెలిసిందే. అయ్య‌గారి దెబ్బ‌కి ప్ర‌ధాని మోడీ అంత‌టి బిజీ ప‌ర్స‌న్ సైతం స్పందించ‌క త‌ప్ప‌లేదు. మాట‌లు క‌ట్టిపెట్టి.. కాస్త పాల‌న మీద ఫోక‌స్ పెంచాల‌న్న సూచ‌న‌తో విప్ల‌వ్ మాష్టారి నోరు మూత ప‌డింది.

అప్ప‌టి నుంచి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం ఆపేశారు. విప్ల‌వ్ కుమార్ కు మించిన‌ట్లుగా తాజాగా యూపీ మంత్రి ఒక‌రు విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. సాంకేతిక‌త భార‌త్‌కు కొత్త కాదంటూ.. పురాత‌న కాలం నుంచి అవ‌న్నీ అందుబాటులో ఉన్నాయ‌ని.. మ‌హాభార‌తం కాలం నుంచే దేశంలో పాత్రికేయం ఉందంటూ కొత్త త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.

ఇంత‌కీ ఇలాంటి ముచ్చ‌ట్లు చేసిన మంత్రి గారి పేరేమిటంటారా?.. దినేశ్ శ‌ర్మ‌. యూపీ ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తాజాగా మ‌ధుర‌లో నిర్వ‌హించిన హిందీ జ‌ర్న‌లిజం డేకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. మ‌హాభార‌త కాలం నుంచే పాత్రికేయం ఉంద‌ని.. కురుక్షేత్రంలో చూపులేని ధృత‌రాష్టుడికి ఆయ‌న ర‌థ‌సార‌ధి సంజ‌యుడు యుద్ధం గురించి వివ‌రంగా చెప్ప‌టం.. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కాదంటారా? అని ప్ర‌శ్నించారు.

అంతేనా.. మీ గూగుల్ ఉంది చూశారు.. అదిప్పుడు మొద‌లైంది. కానీ.. మా గూగుల్ ఎప్ప‌టినుంచో ఉందంటూ నార‌దుడ్ని తెర మీద‌కు తెచ్చారు. నార‌దడు స‌మాచార గ‌ని అని.. ఎక్క‌డి విష‌యాన్ని అయినా ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా చేర‌వేయ‌గ‌ల‌డ‌ని చెప్పుకొచ్చారు. పురుణాల మీద మంత్రిగారికి ప‌ట్టు ఉంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. వ‌ర్త‌మానానికి పురాణాల్ని లింక్ చేస్తున్న వైనం రానున్న రోజుల్లో మ‌రే స్థాయికి వెళుతుందో?