Begin typing your search above and press return to search.

ఊబెర్ షేర్ ఎంత ప‌ని చేసింది?

By:  Tupaki Desk   |   26 Jun 2018 5:06 AM GMT
ఊబెర్ షేర్ ఎంత ప‌ని చేసింది?
X
మ‌హాన‌గ‌రాలు మొద‌లుకొని ఒక మోస్త‌రు న‌గ‌రాల్లోకి విస్త‌రిస్తున్నాయి యాప్ ఆధారిత క్యాబ్ స‌ర్వీసులు. ఈ సేవ‌ల్ని అందించే ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ఒక‌టి ఊబెర్‌. తాజాగా ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఒక‌టి ఊబెర్ షేర్లో చోటు చేసుకుంది. క‌ల‌లో కూడా ఊహించ‌ని రీతిలో జ‌రిగిన ఈ ఉదంతంపై ఊబెర్ రియాక్ష‌న్ పై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..

ముంబ‌యికి చెందిన ఉష్నోటా జూన్ పౌల్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఊబెర్ షేర్ (ఫూల్‌)బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో క్యాబ్ ఉరిమి ఎస్టేట్‌కు చేరుకోగానే.. క్యాబ్లో ఉన్న ప్ర‌యాణికురాలు డ్రైవ‌ర్ తో గొడ‌వ ప‌డింది. తాను ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్న‌ప్పుడు త‌న‌ను మొద‌ట దించాలే కానీ.. వేరే ప్రయాణికురాలిని ఎలా దించుతారంటూ గొడ‌వ ప‌డ్డారు. షేర్ లో బుకింగ్ ఆధారంగా ఎవ‌రి డ్రాప్ ఎప్పుడ‌న్న‌ది డిసైడ్ అవుతుంది. ఈ విష‌యంలో డ్రైవ‌ర్ చేసేదేమీ లేదు. ఇదే విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసినా స‌ద‌రు ప్రయాణికులురాలు విన‌లేదు.

డ్రైవ‌ర్ చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న జ‌ర్న‌లిస్టు ఉష్నోటాకు ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది డ్రైవ‌ర్‌ కు మ‌ద్దుతుగా మాట్లాడిన మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై స‌ద‌రు మ‌హిళ భౌతిక దాడికి పాల్ప‌డ‌ట‌మే కాక‌.. బండ‌బూతులు తిట్ట‌టం మొద‌లు పెట్టింది. ఈ ప‌రిణామానికి స‌ద‌రు జ‌ర్న‌లిస్టు షాక్ తింది.

ఇంత జ‌రుగుతున్నా స‌ద‌రు డ్రైవ‌ర్ మాత్రం రియాక్ట్ కాలేదు. వారిద్ద‌రి గొడ‌వ‌ను మౌనంగా చూస్తుండిపోయాడే కానీ.. స్పందించింది లేదు. అయితే.. వీరి గొడ‌వ‌ను చూసిన అక్క‌డి స్థానికులు రియాక్ట్ అయ్యారు. వారిలోని ఒక సెక్యూరిటీ గార్డు ఉష్నోటాను సేవ్ చేశారు. ఈ ఉదంతంపై ఫోటోలు తీసే ప్ర‌య‌త్నం చేయ‌బోగా.. ఫోన్ ను ప‌గ‌ల‌గొడ‌తాన‌ని బెదిరించిన‌ట్లుగా బాధితురాలు వాపోతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. దీనిపై బాధిత జ‌ర్న‌లిస్టు ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేష‌న్లో కంప్లైంట్ ఇచ్చారు. ఊబెర్ దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో.. త‌న‌పై జ‌రిగిన దాడికి సాక్ష్యంగా ప‌లు చిత్రాల్ని ఉష్నోట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైర‌ల్ గా మార‌ట‌మే కాక‌.. జ‌ర్న‌లిస్టుకు అండ‌గా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఊబెర్ సంస్థ తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.ద ఈంతో.. జ‌రుగుతున్న డ్యామేజ్ ను గుర్తించిన ఊబెర్ జ‌రిగిన ఘ‌ట‌న త‌మ‌కు షాక్‌కు గురి చేసింద‌ని.. ఏం జ‌రిగింద‌న్న అంశంపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. అదేదో ముందే చేసి ఉంటే స‌రిపోయేది క‌దా?