Begin typing your search above and press return to search.
మహా జంగిల్ రాజ్ గా బీహార్ మారిందే
By: Tupaki Desk | 14 May 2016 7:17 AM GMTబీహార్ రాష్ట్రానికి సంబంధించి నితీశ్ ముఖ్యమంత్రి కావటానికి ముందు.. సీఎం అయ్యక అని విభజించి చెబుతుంటారు. బీహార్ రూపురేఖల్నిమార్చటంతో పాటు.. ఆ రాష్ట్ర ఇమేజ్ ను అమాంతం మార్చేసిన ఘనత నితీశ్ కే దక్కుతుంది. బీహార్ అన్న వెంటనే జంగిల్ రాజ్ అన్న విమర్శ దేశ వ్యాప్తంగా వినిపించేంది. బీహారీలను చాలా చులకనగా చూసేవారు. అలాంటి పరిస్థితిని తప్పించిన ముఖ్యమంత్రిగా నితీశ్ ను బీహారీలు అమితంగా ఆరాధిస్తారు.
అలాంటి నితీశ్ రాజ్యంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన ఇమేజ్ నుభారీగా డ్యామేజ్ చేసేలా ఉండటం గమనార్హం. జంగిల్ రాజ్ కాదు.. మహా జంగిల్ రాజ్ గా బీహార్ మారిందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా ఇటీవల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న తన కారును ఓవర్ టేక్ చేశారన్న కోపంతో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుమారుడు తుపాకీతో కాల్పులు జరపటం.. ఒక అమాయకుడ్ని చంపేయటం తెలిసిందే.
అనంతరం పోలీసులు ఈ వ్యవహారం మీద సీరియస్ అయి.. వారి మీద చర్యలు తీసుకోవటం తర్వాతి సంగతి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ హత్యకు గురి కావటం సంచలనంగా మారింది. బీహార్ లోని సివాన్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దేవ్ రంజన్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపటం గమనార్హం. హిందుస్తాన్ అనే దినపత్రికలో రాజ్ దేవ్ ఇరవై ఏళ్లుగా పని చేస్తున్నారు. ఆయన శరీరంలో ఐదు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.ఈ హత్యకు సంబంధించిన వివరాలు బయటకురావాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకుంటున్న ఉదంతాలతో బీహార్ జంగిల్ రాజ్ కాదు.. మహా జంగిల్ రాజ్ గా మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.