Begin typing your search above and press return to search.
మోదీని టచ్ చేసిన జర్నలిస్టు.. తర్వాత ఏం జరిగింది?
By: Tupaki Desk | 19 Jun 2020 6:50 AM GMTమోడీ దత్తత గ్రామంపైనే వార్త రాశాడు. అందులోని సమస్యలను ఏకరువు పెట్టారు. మోడీపైనే రాస్తావా అని ఆ జర్నలిస్టును పోలీసులు ఏం చేశారో తెలిస్తే ముక్కున వేలేసుకోవల్సిందే.. ప్రధాని మోదీ తను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో దత్తత తీసుకున్న దోమారి గ్రామంలోని కష్టాల పై ఓ జర్నలిస్టు కథనం రాశాడు. లాక్ డౌన్లో ప్రజల కష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని జర్నలిస్టు చేసిన ప్రయత్నానికి అతడిని మెచ్చుకోవాల్సి పోయింది పోలీసులు కేసులు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని మోదీ దోమారి గ్రామాన్ని ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’లో దత్తత తీసుకున్నారు. దేశంలో లాక్ డౌన్ కారణంగా దోమారి గ్రామంలోని ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని స్క్రోల్ ఇన్ మీడియా జర్నలిస్టు ఓ వార్తను ప్రచురించాడు. అయితే ఇందులోని అంశాలు అవాస్తమంటూ స్థానిక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు 'స్క్రోల్ ఇన్' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియ శర్మ, ప్రధాన ఎడిటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జర్నలిస్టులపై కేసు నమోదు చేయడంపై సదరు మీడియా సంస్థ స్పందించింది. ప్రజల కష్టాలను ఎత్తిచూపితే తమ పై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇది జర్నలిస్టుల హక్కులను కాలరాయడమేనని మండిపడింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు ముందుండి ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారని గుర్తుచేశారు. పాత్రికేయులను పోలీసుల కేసులతో బెదిరించడం మంచికాదని హితవు పలికింది.