Begin typing your search above and press return to search.
ఏపీలో అక్రిడేటెడ్ జర్నలిస్టులపై టాక్స్
By: Tupaki Desk | 22 Jan 2023 6:14 AM GMTఏపీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12,500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది.
వృత్తిపన్ను చెల్లించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ.2,500 చొప్పున మొత్తం రూ.12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు.
కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా అక్రిడేషన్లు ఇవ్వడం.. ఇళ్ల స్థలాలు ఇవ్వడం వంటివేమీ చేయలేదని.. అసలు జర్నలిస్టుల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని.. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని .. ఇప్పుడు ఈ దోపిడీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం పట్టణాలు, మేజర్ పంచాయతీలలో చెత్త పన్ను వంటివి విధించి ఇప్పటికే వ్యతిరేకత మూటకట్టుకోగా ఇప్పుడు జర్నలిస్టులపై పన్ను వేసి వ్యతిరేకంగా పెంచుకుంటోంది.
అక్రిడేషన్లు లేవు.. ఉన్నా దానివల్ల ప్రయోజనాలు లేవు.. ఇప్పుడు అదనంగా టాక్స్ కూడా కట్టాలా అని ఏపీ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.