Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు జర్నలిస్టుల షాక్

By:  Tupaki Desk   |   24 Sep 2016 9:51 AM GMT
చంద్రబాబుకు జర్నలిస్టుల షాక్
X
ఏపీలో ఎదురే లేకుండా సాగిపోతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మీడియా నుంచి గట్టి మద్దతు ఉందన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కేవలం సాక్షి పత్రిక తప్ప ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారే లేరు. సాక్షి కూడా కొద్దికాలంగా చంద్రబాబు వ్యతిరేక వార్తల జోరు తగ్గించింది. మేనేజ్ మెంట్లు అనుకూలంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగాజర్నలిస్టులూ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయడం వంటివి లేవు. అంతేకాదు... సహజంగా తమకు మర్యాదలు చేయడంలో కానీ, ప్రాధాన్యం ఇవ్వడంలో కానీ ఇసుమంత లోపం చేసినా ఆగ్రహించే జర్నలిస్టులు ఇటీవల కాలంలో సర్దుకుపోతున్నారు. దీంతో చంద్రబాబు కొద్దికాలంగా జర్నలిస్టులను బాగా లైట్ గా తీసుకుంటున్నారు.వారిపై పెత్తనం చెలాయించే ప్రయత్నమూ చేస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అయితే జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నేతలు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మీరంతా ఉగ్రవాదులు అంటూ ఆయన ఫైరయ్యారు. అయినా, పాపం వారు జర్నలిస్టుల సంక్షేమం కోసం మౌనంగా దాన్ని భరించి వెనుదిరిగారు. కానీ... తాజాగా చంద్రబాబు ప్రీతిపాత్రమైన జిల్లా పశ్చిమ గోదావరి జర్నలిస్టులు మాత్రం సీఎం కు షాకిచ్చారు. చంద్రబాబు ర్యాలీనే అడ్డుకుని ధర్నా చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న వేళ, జరుగుతున్న ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. జర్నలిస్టులపై దౌర్జన్యం చేయడంతో పలు టీవీ చానళ్ల కెమెరామెన్లు కింద పడ్డారు. దీంతో జర్నలిస్టులు ఆగ్రహించి, చంద్రబాబు ర్యాలీని అడ్డుకుని ధర్నా చేశారు. ఇలా అయితే పర్యటనను కవర్ చేయబోమంటూ హెచ్చరించారు. దీంతో చంద్రబాబు జరగబోయే డ్యామేజీని అర్థః చేసుకుని మెట్టు దిగారు... తమ పోలీసులు చేసిన పనికి తాను క్షమాపణ చెబుతున్నారని అనడంతో వారంతా శాంతించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి, మరోసారి ఇలా జరగకుండా చూస్తానని చెప్పడంతో జర్నలిస్టులు శాంతించారు. ఆపై ర్యాలీ కొనసాగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/