Begin typing your search above and press return to search.
బాబు వద్దు...కేసీఆర్ ముద్దు: జర్నలిస్టులు
By: Tupaki Desk | 17 Nov 2018 6:29 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికలలో మీడియా ఎటువైపు ఉంది. తెలంగాణ జర్నలిస్టులు ఏ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మీడియా యాజమాన్యాల సంగతి ప్రక్కన పెడితే జర్నలిస్టులు మాత్రం కల్వకుంట్ల వారి కారుకే తమ మద్దతు అంటున్నారు. సమైక్య రాష్ట్రానికి 9 సంవత్సారాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు - మూడు దశాబ్దాలకు పైగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీల కంటే తెలంగాణ రాష్ట్ర సమితి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జర్నలిస్టులకు ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్దలాల పంపిణి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తేనే జరుగుతుందని జర్నలిస్టులు నమ్ముతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు. తమ నాలుగేళ్ల పాలనలో ప్రెస్ ఆకాడమీకి నిధులు - జిల్లాలోను - డస్క్ లోను ఉన్న జర్నలిస్టులకు హెల్త్ కార్డుల వంటివి ఇచ్చామని చెప్పారు.
కలగూరగంప మహాకూటమి అధికారంలోకి వస్తే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందన్న భావన జర్నలిస్టులలో నెలకొంది. పైగా నాలుగు పార్టీల కూటమి జర్నలిస్టులను నాలుగు భాగాలుగా చేస్తారని - తమ వారు - పరాయి వారు... అనే విభజన చూపిస్తారని జర్నలిస్టులు భావిస్తున్నట్లు సమాచారం. అదే ఏక పార్టీ పాలన అయితే నిర్ణయాలు త్వరగా తీసుకుని జర్నలిస్టులకు మేలు చేస్తారనే భావిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుల మధ్య జర్నలిస్టుల పరంగా ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు నేరుగా మీడియా సంస్దల యాజమాన్యాలతో సంబంధాలు పెట్టుకుంటారని - ఈ వైఖరి జర్నలిస్టులను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేసిందంటున్నారు. అనేక సార్లు తమకు అనుకూలంగా వార్తలు రాసిన ఏ ఒక్కసారో వ్యతిరేక వార్త రాస్తే ఆ జర్నలిస్టు అంతు చూడడం చంద్రబాబు నైజంగా చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మీడియా యాజమాన్యాల కంటే జర్నలిస్టులతోనే సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. వ్రుత్తి పరంగా యాజమాన్యాలు చెప్పినట్టు వార్తలు రాసిన తామూ తమ కుటుంబ సభ్యులు మద్దతు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.