Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తెలివైనోడేనబ్బా..?
By: Tupaki Desk | 5 Dec 2018 5:06 PM GMTఉత్కంఠకు తెరపడింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన తన సోదరి నందమూరి సుహాసిని కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనే లేదు. చివరి మూడు రోజుల్లో వస్తాడు.. చివరి రోజు వస్తాడు.. అంటూ తెలుగుదేశం వర్గాలు చేసిన ప్రచారం ఉత్తుత్తిదే అని తేలిపోయింది. బుధవారమే ప్రచారానికి తెరపడగా.. చివరి రోజు కూడా తారక్ బయటికి రాలేదు. అక్క కోసం ప్రచారం చేయలేదు. తారక్ వస్తాడన్న నమ్మకాలు ఎవ్వరికీ పెద్దగా లేవు కానీ.. కనీసం కళ్యాణ్ రామ్ అయినా వస్తాడేమో అని తెలుగుదేశం శ్రేణులు ఆశించాయి. ఆశ్చర్యకరంగా అతను కూడా ప్రచారం చేయలేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను కావాలనే పొడిగించుకుని.. దాన్ని కారణంగా చూపి ప్రచారానికి రాలేదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా ‘118’ షూటింగుకి పరిమితం అయినట్లున్నాడు. ప్రచారానికి దూరంగా ఉండాలన్న అన్నదమ్ముల నిర్ణయం తెలివైందే అని అంతా అంటున్నారు.
సుహాసినిని బరిలోకి దించడంలో బాబు వ్యూహం ఏంటో అర్థం చేసుకోలేనిదేమీ కాదు. పార్టీ ప్రయోజనాల కోసం హరికృష్ణ మరణం తాలూకు సానుభూతిని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు జనాల్లో ఉన్న సానుకూలతను వాడుకోవాలని చూశారు బాబు. అది తెలుసుకోకుండా ప్రచారానికి వస్తే ఎన్టీఆర్ తన అభిమానుల నుంచే కాక బయటి వాళ్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొనేవాడు. అసలు అతను సుహాసినికి మద్దతుగా ప్రెస్ నోట్ ఇవ్వడాన్నే అభిమానులు వ్యతిరేకించారు. ఇక ప్రచారానికి వస్తే అంతే సంగతులు. బాలయ్య లాగే బాబుకు ఎన్టీఆర్ కూడా బానిసే అనేవాళ్లు. బాబుకు తారక్ తలొగ్గిపోయాడంటారు. తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ ప్రచారానికి రాక తప్పని పరిస్థితి నెలకొంటుంది. 2009 అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తారక్ మరోసారి తప్పు చేయడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేడని ఇప్పుడు చాటినట్లయింది.