Begin typing your search above and press return to search.
టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు...!
By: Tupaki Desk | 19 Dec 2022 3:53 AM GMTతెలుగుదేశం పార్టీకి పెద్ద రాముడు ఆయువు పట్టు. ఈ రోజుకీ ఆయన పేరు మీదనే పార్టీ పునాదులు నిలిచి ఉన్నాయి. ఇక యువతరానికి భావితరానికి వారధిగా సారధిగా చిన్న రాముడు ఉన్నారు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్న జూనియర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కనుక ఎన్నికల ప్రచారం కోసం కదం తొక్కితే పదం కదిపితే ఏపీలో సైకిల్ జోరు ఎవరూ ఆపలేరు అని తమ్ముళ్ల ప్రగాఢ నమ్మకం.
అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనుక పసుపు జెండా రెపరెపలు ఏపీలో ఎగరడం ఖాయం. చంద్రబాబు పార్టీకి గ్రామర్ తెచ్చినా గ్లామర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. బాబు ఎక్కడికి వెళ్ళినా తమ్ముళ్ళు కోరేది కూడా అదే. నందమూరి ఫ్యామిలీలో ఉన్న అతి పెద్ద ఆస్తి జూనియర్ అని ఆయన్ని వాడుకోవాలని కూడా అంతా అంటారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయడం కొత్త ఏమీ కాదు, గతంలో ఆయన చేశారు. 2009 ఎన్నికలపుడు జూనియర్ కాలికి బలపం కట్టుకుని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కలియతిరిగారు. అలాగే తెలనగాణా జిల్లాలలో తిరిగారు. అలా పార్టీకి బలంగా జూనియర్ ఉన్నారు. ఈ నేపధ్యంలో జూనియర్ ఎంటీయార్ తెలుగుదేశానికి మళ్లీ ప్రచారం చేయాలని 2014 నుంచి తమ్ముళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు.
బహుశా అధి 2024 ఎన్నికల ముందు సాధ్యపడుతుంది అని అంటున్నారు. ఈ విషయాన్ని చెప్పినది నందమూరి తారకరత్న. ఆయన తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి తప్పకుండా వస్తారు. అయితే అది ఎపుడు అన్నది ఆయన తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని అన్నారు.
తామంతా టీడీపీ సభ్యులమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ తమదని ఆయన చెప్పుకున్నారు. నందమూరి కుటుంబం పదవుల కోసం ఏ రోజూ ఆరాటపడలేదని, ఆశపడలేదని అన్నారు. రేపటి రోజున రాష్ట్రం బాగుండాలి అంటే కనుక తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే అని ఆయన అన్నారు. తామంతా చంద్రబాబు వెంట ఉంటామని, ఆయనకు అండగా ఉంటామని తారకరత్న చెప్పడం విశేషం.
మొత్తం నందమూరి ఫ్యామిలీయే టీడీపీ వెనక ఉంది అని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని తారకరత్న మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. తాను ఏ సీటు నుంచి పోటీ చేసేది ఆయన చెప్పకపోయినా పోటీ అన్నది తధ్యమని చెప్పారు. మొత్తానికి పాడైపోయిన ఏపీని కాపాడడం కోసం నందమూరి ఫ్యామిలీ అంతా ఈసారి రంగంలోకి దిగుతుంది అని ఆయన అన్నారు.
మరి తారకరత్న చెప్పేది కరెక్టేనా. ఆయన చెప్పినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా. ఆయన్ని ఆ విధంగా ఫ్యామిలీ అంతా మౌల్డ్ చేస్తోందా. టాలీవుడ్ కూడా జూనియర్ మీద వత్తిడి పెడుతోందా ఇవన్నీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.