Begin typing your search above and press return to search.

వామ్మో.. తారక్ ను ఇరికించేసిన తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   11 Oct 2019 9:21 AM GMT
వామ్మో.. తారక్ ను ఇరికించేసిన తమ్ముళ్లు
X
ప్రభుత్వాలు మారిన దానికి తగ్గట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు చోటు చేసుకోవటం కామన్. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ.. తెలుగు తమ్ముళ్లు కొందరు చేసిన నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇదేం లెక్క అంటూ కొత్త చర్చకు తెర తీసింది. అభిమానం పేరుతు అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేశారా? లేక.. తెలీని అత్యుత్సాహంతో ఈ పని చేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

గ్రామ సచివాలయానికి కొత్త రంగులు వేసి.. ముఖ్యమంత్రి వైఎస్ ఫోటో పెట్టాల్సిన చోట.. వివాదాస్పదంగా వ్యవహరించారు కొందరు తెలుగు తమ్ముళ్లు. కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు పోలీసు కేసు వరకూ వెళ్లటమే కాదు.. అరెస్ట్ అయ్యారు. ఇంతకీ జరిగిందేమంటే..

కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి కొత్తగా రంగులు వేశారు. ఇంతవరకూ ఓకే..కానీ.. ఇక్కడే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు వివాదాస్పదంగా వ్యవహరించారు. గ్రామ సచివాలయానికి సీఎం జగన్ ఫోటో పెట్టాల్సింది పోయి.. ఆ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టటమే కాదు.. భవనానికి పసుపుపచ్చ రంగు వేశారు.

దీంతో.. అధికార.. విపక్ష నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర సీఎం ఫోటోకు బదులుగా సినీ నటుడు తారక్ ఫోటో పెట్టటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని.. జరిగిన ఘటనను పరిశీలించారు. అనంతరం ఈ వివాదాస్పద వ్యవహారానికి కారణమైన 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదుచేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లేలా చేయటమే కాదు.. సీఎం జగన్ కు బదులుగా తారక్ ఫోటో పెట్టటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తారక్. ఇలాంటివేళలో పార్టీ కార్యకర్తలు ఆయన ఫోటోను పెట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.