Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు మళ్లీ షాక్: జూ.ఎన్టీఆర్ నినాదాలు

By:  Tupaki Desk   |   14 July 2021 9:30 AM GMT
చంద్రబాబుకు మళ్లీ షాక్: జూ.ఎన్టీఆర్ నినాదాలు
X
చేసిన కర్మ ఊరికే పోదంటారు. అప్పుడెప్పుడో తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను కూలదోసి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబుకు ఇన్నాళ్లు హనీమూన్ పీరియడ్ లా సాగింది. కానీ గత ఎన్నికల్లో జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇక టీడీపీ పని అయిపోయిందని..చంద్రబాబుకు వయసు మీదపడిందని..లోకేష్ తో కాదని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో, బయటా ఘోల్లు మన్నారు. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసి షాకిచ్చారు. చంద్రబాబును ఇన్నాళ్లు జైకొట్టిన కుప్పం తెలుగు తమ్ముళ్లే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. దీంతో చంద్రబాబు ఇరుకునపడ్డట్టు అయ్యింది. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గంలో మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 40 అడుగుల ఎత్తులో భారీ జెండాను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపింది.. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సడలుతోందని దీన్ని బట్టి అర్తమవుతోందంటున్నారు.

కుప్పంలో ఎన్టీఆర్ కు జైకొట్టడం ఇదే మొదటిసారి కాదు.. అప్పట్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబునే ఎన్టీఆర్ ను తేవాలని ప్రశ్నించారు. చంద్రబాబు దానికి ఏదో సర్దిచెప్పి ఊరుకున్నారు. కానీ తాజాగా మరో చోట కూడా అదే సీన్ రిపీట్అయ్యింది.

ఏపీ టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ చంద్రబాబు పర్యటిస్తుండగా.. కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హల్ చల్ చేశారు. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వారు నినాదాలు చేశారు.

ఇవన్నీ గమనిస్తూనే చంద్రబాబు తన పర్యటనను కొనసాగించారు. దీనిపై ఈసారి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. మున్ముందు టీడీపీలో ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి చంద్రబాబు, లోకేష్ లు ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది ఆసక్తిగా మారింది.