Begin typing your search above and press return to search.
వైరల్ పిక్: ఎన్టీఆర్ తో కేటీఆర్
By: Tupaki Desk | 20 Dec 2018 6:23 AM GMTఈ ఒక్క చిత్రం.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ తరుఫున కూకట్ పల్లి నుంచి పోటీచేసి ఓడిపోయిన నందమూరి సుహాసిని తమ్ముడు - స్టార్ హీరో ఎన్టీఆర్.. తాజాగా కేటీఆర్ ను కలిసి దిగిన ఫొటో వైరల్ గా మారింది. వీరిద్దరూ ఓ పార్టీలో కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటోను తాజాగా ఇప్పుడు తీసిందా.? గతంలో తీసిందా మాత్రం తెలియరాలేదు. ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచిన తర్వాత ఇప్పుడు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఫొటో ఎక్కడిదనే ఆరాతీస్తే.. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ హై ఫ్రొఫైల్ ఫ్యామిలీ పార్టీలో తీసిందని అర్థమవుతోంది. ఈ వేడుకకు కేటీఆర్ రాగా.. ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎన్టీఆర్ - కేటీఆర్ కలిసి దిగిన ఫొటోగా నిర్ధారణ అవుతోంది.
ఇటీవల ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ - కేటీఆర్ లు ఒకే వేదికపై ఇలా దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. నందమూరి కుటుంబం ఈ ఎన్నికల్లో టీడీపీ వెంట నడిచింది. అక్క సుహాసిని పోటీచేసినా ఎన్టీఆర్ ఆమె తరుఫున ప్రచారం చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ ను ఎన్టీఆర్ పార్టీలో కలవడం.. సన్నిహితంగా ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవలే కేటీఆర్ - ఎన్టీఆర్ మధ్య బంధం బలపడింది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆ కుటుంబానికి కేటీఆర్ - కేసీఆర్ అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. హరికృష్ణ అంత్యక్రియలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. హరికృష్ణ ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్.. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లను పరామర్శించారు. హరికృష్ణకు ప్రత్యేక స్మారకాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారు.
ఈ కృతజ్ఞతతోనే ఎన్టీఆర్ తన అక్క తరుఫున టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా మిన్నకుండిపోయారని వార్తలొచ్చాయి. అందుకే కూకట్ పల్లిలో టీడీపీ తరుఫున ఎన్టీఆర్ ప్రచారం చేయలేదని సన్నిహితులు చెప్పారు. వాటికి బలాన్ని ఇచ్చేలా కేటీఆర్ - ఎన్టీఆర్ లు కలిసి ఉన్న ఈ ఫొటో బయటకు రావడంతో టీడీపీ అభిమానులు కలత చెందుతున్నట్టు సమాచారం.