Begin typing your search above and press return to search.

మంత్రుల ప్రొఫైల్స్: వైఎస్ జగన్ మంత్రులు..ఎవరేంటి?

By:  Tupaki Desk   |   8 Jun 2019 6:19 AM GMT
మంత్రుల ప్రొఫైల్స్:  వైఎస్ జగన్ మంత్రులు..ఎవరేంటి?
X
జగన్ కేబినెట్ కొలువుదీరడానికి అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలన్నిటికీ జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. పార్టీకి అహర్నిశలు సేవ చేసినవారు - జగన్ విధేయులకు అవకాశం దొరికింది. కేబినెట్ లోని 25 మంది నేపథ్యం పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.

1) ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి గెలిచిన ఈ 64 ఏళ్ల నేత ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీకాం చదువుకున్న ఆయన ఆది నుంచి జగన్ వెంటే నిలిచారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావు కంటే కూడా కృష్ణదాసే జగన్‌ కు అత్యంత నమ్మకస్థుడు.

2) బొత్స సత్యనారాయణ:

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన బొత్స సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రాజకీయ వ్యూహాల పరంగా సమర్థుడున్న పేరుంది. 61 ఏళ్ల బొత్స ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా - ఒకసారి ఎంపీగా గెలిచారు. వైఎస్‌ - కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక బొత్స తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు కానీ - వైసీపీలోకి వచ్చాక మాత్రం జగన్ పట్ల విధేయుడిగా ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.

3) పాముల పుష్ప శ్రీవాణి:

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే. మంత్రివర్గంలో ఈమే అత్యంత చిన్నవయస్కురాలు. బీఎస్సీ చదువుకున్న శ్రీవాణి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏదైనా పని అప్పగిస్తే బాగా అధ్యయనం చేసి మంచి సలహాలు ఇస్తారన్న పేరుంది. అదే ఆమె పట్ల జగన్‌కు నమ్మకం కలగడానికి, మంత్రిగా అవకాశం ఇవ్వడానికి కారణమైంది.

4) ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)

నియోజకవర్గం: భీమిలి (విశాఖ జిల్లా)
వయస్సు: 52
విద్యార్హత: ఇంటర్మీడియెట్
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ - రెండుసార్లు ఎమ్మెల్యే

5) పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

నియోజకవర్గం: మండపేట(తూర్పుగోదావరి)
వయస్సు: 69
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యే - వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.

6) పినిపె విశ్వరూప్‌

నియోజకవర్గం: అమలాపురం(తూర్పుగోదావరి)
వయస్సు: 55
విద్యార్హత: బీఎస్సీ - బీఈడీ
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్‌ - కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

7) కురసాల కన్నబాబు

నియోజకవర్గం: కాకినాడ రూరల్‌(తూర్పుగోదావరి)
వయస్సు: 46
విద్యార్హత: బీకాం - ఎంఏ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు.

8) తానేటి వనిత

నియోజకవర్గం: కొవ్వూరు(పశ్చిమగోదావరి)
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

9) చెరుకువాడ శ్రీరంగనాథరాజు

నియోజకవర్గం: ఆచంట (పశ్చిమగోదావరి)
వయస్సు: 66
విద్యార్హత: ఇంటర్మీడియట్
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

10) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు(పశ్చిమగోదావరి)
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌ లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.

11) కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ(కృష్ణా జిల్లా)
వయస్సు: 47
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

12) వెల్లంపల్లి శ్రీనివాస్‌

నియోజకవర్గం: విజయవాడ పశ్చిమ(కృష్ణా జిల్లా)
వయస్సు: 48
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం - కాంగ్రెస్‌ - భాజపాలో పనిచేశారు.

13) పేర్ని వెంకట్రామయ్య (నాని)

నియోజకవర్గం: మచిలీపట్నం(కృష్ణా)
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌ గా పనిచేశారు.

14) మేకతోటి సుచరిత

నియోజకవర్గం: ప్రత్తిపాడు( గుంటూరు )
వయస్సు: 41
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

15) మోపిదేవి వెంకటరమణ

నియోజకవర్గం: రేపల్లె(గుంటూరు)
వయస్సు: 55 సంవత్సరాలు
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ - రోశయ్య - కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

16) బాలినేని శ్రీనివాసరెడ్డి

నియోజకవర్గం: ఒంగోలు(ప్రకాశం)
వయస్సు: 55
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌
రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే - వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.

17) ఆదిమూలపు సురేశ్‌
నియోజకవర్గం: ఎర్రగొండపాలెం(ప్రకాశం)
వయస్సు: 45
విద్యార్హత: ఐఆర్ ఎస్‌
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ సభ్యుడిగా - వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు.

18)మేకపాటి గౌతమ్‌ రెడ్డి

నియోజకవర్గం: ఆత్మకూరు( నెల్లూరు)
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ (టెక్స్‌ టైల్స్‌)
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

19) అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నియోజకవర్గం: నెల్లూరు సిటీ( నెల్లూరు)
వయస్సు: 39
విద్యార్హత: బీడీఎస్‌
రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌ గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు

20) బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

నియోజకవర్గం: డోన్‌(కర్నూలు)
వయస్సు: 47
విద్యార్హత: బీఈ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌ గానూ పనిచేశారు.

21) గుమ్మనూరు జయరాం(కర్నూలు)

నియోజకవర్గం: ఆలూరు
వయస్సు: 51
విద్యార్హత: పదోతరగతి
రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

22) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నియోజకవర్గం: పుంగనూరు(చిత్తూరు)
వయస్సు: 67
విద్యార్హత: ఎంఏ - పీహెచ్‌ డీ (సోషియాలజీ)
రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే - వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి.

23) కె.నారాయణస్వామి(చిత్తూరు)

నియోజకవర్గం: గంగాధర నెల్లూరు
వయస్సు: 51
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

24) అంజద్‌ బాషా
నియోజకవర్గం: కడప(కడప)
వయస్సు: 48
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌ గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

25) యం. శంకరనారాయణ

నియోజకవర్గం: పెనుకొండ(అనంతపురం)
వయస్సు: 54
విద్యార్హత: బీకాం - ఎల్ ఎల్‌ బీ
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.