Begin typing your search above and press return to search.
జూబ్లీగ్యాంగ్ రేప్ తర్వాత బాధితురాలిని ట్రాక్ చేసిన నిందితులు
By: Tupaki Desk | 15 Jun 2022 8:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న మైనర్ నిందితుల్లో ముగ్గురికి మంగళవారంతో గడువు ముగియగా.. బుధవారం మరో ఇద్దరు విచారణను పూర్తి చేయనున్నారు. పోలీసుల విచారణలో నిందితులు పలు విషయాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
గ్యాంగ్ రేప్ అనంతరం బాధితురాలిని.. వారి ఫ్యామిలీని నిందితులు ట్రాక్ చేసినట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తండ్రి కంప్లైంట్ ఇవ్వటం గురించి తెలుసుకున్నంతనే ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ నుంచి తలోదిక్కుకు పారిపోయిన వైనం వెలుగు చేసింది.
బంజారాహిల్స్ లో ఉండే ఒక నిందితుడు తన తల్లి అప్పటికే ఊటీలో ఉన్నారని.. ఆమె దగ్గరకు వెళ్లిపోగా.. మరో నిందితుడు నెల్లూరు దగ్గర్లోని దర్గాకు వెళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు.
మరో ఇద్దరు మైనర్ నిందితులు పోలీసుల దర్యాప్తు వేగాన్ని చూసి.. పారిపోతే పట్టుబడటం ఖాయమన్న విషయాన్ని గుర్తించి.. మధ్యవర్తుల సాయంతో పోలీసులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా హామీ పొందిన తర్వాత లొంగిపోయినట్లుగా చెబుతున్నారు. మరో మైనర్ నిందితుడు గుల్బర్గాలో చిక్కినట్లుగా తెలుస్తోంది.
ఇలా ఎవరికి వారుగా పారిపోయిన నిందితుల్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారణలో తాము చేసిన పనుల్ని అంగీకరించిన నేపథ్యంలో.. వాటికి సంబంధించిన సాక్ష్యాల్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అంతేకాదు.. గ్యాంగ్ రేప్ తర్వాత బాధిత కుటుంబ సభ్యులను మైనర్ నిందితులు బెదిరించినట్లుగా తెలుస్తోంది.
కేసు వద్దంటూ వారు పేర్కొనగా.. వారి మాటల్ని ఖాతరు చేయకుండా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే బాధితురాలి తండ్రికి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరైనది కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పాడు పని చేసి.. దాని నుంచి తప్పించుకోవటాని నిందితులు చాలానే ప్రయత్నాలు చేసిన వైనం తాజా విచారణతో స్పష్టమైందని చెప్పాలి.