Begin typing your search above and press return to search.

భార్యతో సెక్స్ సుఖం.. ప్రాథమిక హక్కు: న్యాయమూర్తి

By:  Tupaki Desk   |   5 April 2019 1:30 AM GMT
భార్యతో సెక్స్ సుఖం.. ప్రాథమిక హక్కు: న్యాయమూర్తి
X
భార్యతో సంసార సుఖాన్ని పొందడం భర్త ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చారు బ్రిటన్ న్యాయమూర్తి ఒకరు. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆ మేరకు తీర్పును ఇచ్చారు. వైవాహిక జీవితంలో సెక్స్ విషయంలో రకరకాల తీర్పులు వస్తున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆసక్తిదాయకంగా మారింది.

ఇప్పటికే ఇండియాలో మ్యారిటల్ రేప్ అనే అంశంపై చర్చ జరిగింది. కోర్టు లో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. వివాహానంతరం భార్య - భర్తల సెక్స్ అంశం మీద భారతీయ కోర్టుల్లో కూడా చర్చ జరిగింది. భార్యకు ఇష్టం లేని సెక్స్ ను మ్యారిటల్ రేప్ గా పరిగణించే అంశంపై భిన్నవాదనలు వినిపించాయి.

అయితే ఈ విషయంలో వాదనలు ఏమీ లేవని.. మ్యారిటల్ సెక్స్ లో రేప్ అనే పదానికి తావే లేదని, భార్యతో శృంగార సుఖాన్ని ఆశించడం ఆమె భర్త కు ఉండే ప్రాథమిక మానవ హక్కు అని తీర్పునిచ్చారు. అంటోనీ పాల్ హైడెన్ అనే న్యాయమూర్తి ఈ తీర్పును ఇచ్చారు. ఒక జంట ఈ విషయంలో కోర్టుకు ఎక్కగా ఈ మేరకు తీర్పు వచ్చింది!