Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల పై తీర్పు రిజర్వ్ కోర్టు ఏం చెప్తుందో ?

By:  Tupaki Desk   |   20 March 2021 10:30 AM GMT
పరిషత్ ఎన్నికల పై తీర్పు రిజర్వ్ కోర్టు ఏం చెప్తుందో ?
X
ఏపీలో రెండు నెలలుగా ఎన్నికల జాతర కోనసాగుతోంది. పంచాయతీలతో మొదలుపెట్టి మునిసిపల్ ఎన్నికల దాకా కధ సాఫీగా సాగింది. అ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పెండింగులో పరిషత్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. మరి వాటి విషయంలో ఏదో ఒకటి తేలుస్తారా దాని కధ ఏంటి అన్నదే ఇపుడు అందరికీ అర్ధం కాని విషయం. పరిషత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏకంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పట్లో కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఈ ఎన్నికల విషయంలో కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ‌లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలంటూ ఓ ప్రైవేటు వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ‌ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. అయితే, పిటిషన్‌ పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఎన్నికలపై నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్ సరికాదని ఎస్ఈసీ న్యాయవాది తెలిపారు. ఎన్నికలు పరిశీలన దశలోనే పిటిషన్ తొందరపాటని పేర్కొన్నారు. పిటిషన్ ‌పై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.