Begin typing your search above and press return to search.
‘అమ్మ’ మృతిపై జ్యుడిషియల్ విచారణ!
By: Tupaki Desk | 17 Aug 2017 1:36 PM GMTతమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అమ్మ మృతిపై అనేక పుకార్లు వినిపించాయి. జయలలిత మరణం అనుమానాస్పదమేనని - అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ కాక ముందే ఆమెపై కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేశారు. అలాగే ‘అమ్మ’ మృతిపై అనుమానం ఉందని, న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు జయలలిత ఆసుపత్రిలో ఉండగా.. ఆ సమయంలో అమ్మను చూసేందుకు అనుమతించలేదని పన్నీర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అమ్మ మృతిపై తనకు అనుమానాలున్నాయని నటి గౌతమి బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే, జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయ అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం - పళని స్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో అమ్మ మృతి పై దర్యాప్తు విషయం మరుగునపడిపోయింది.
తాజాగా తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శశికళ - దినకరన్ లకు చెక్ పెట్టేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆదేశించారు. అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతో సీఎం పళనిస్వామి - మాజీ సీఎం పన్నీరుసెల్వంలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. పోయేష్ గార్డెన్ లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చేందుకు పళని స్వామి సిద్ధమవుతున్నారు. దీంతో వేదనిలయం నుంచి శశికళ వర్గాన్ని బయటికి పంపే కార్యక్రమాలు మొదలయ్యాయి. పళని - పన్నీర్ వర్గాలు ఏకం కావడానికి పన్నీర్ సెల్వం రెండు కండిషన్లు పెట్టారు. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించడంతో మొదటి కండిషన్ నెరవేరినట్లయింది. శశికళ - దినకరన్ లను పార్టీకి దూరం చేయాలన్న పన్నీర్ రెండో కండిషన్ త్వరలో నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో ప్రధాని మోదీని పన్నీర్ సెల్వం కలిసిన తర్వాత అన్నాడీఎంకేలోని పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇరు వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ముందడుగు వేశాయి. జయ మృతిపై విచారణ పేరుతో శశికళ బ్యాచ్ కు చెక్ పెట్టేందుకు పళని - పన్నీర్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పళని మంత్రి వర్గంలో పన్నీరు వర్గం చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీరుసెల్వంకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముంది. అన్నాడీఎంకేలోని పళని - పన్నీరు వర్గాలు కలిసిన తర్వాత ఇరువర్గాలు ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్నాడీకేఎంకే ఎంపీ మైత్రేయన్ కు కేంద్రమంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.