Begin typing your search above and press return to search.

5జీ.. అంత నష్టమంటూ కోర్టుకు ఎక్కిన ప్రముఖ నటి

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:30 AM GMT
5జీ.. అంత నష్టమంటూ కోర్టుకు ఎక్కిన ప్రముఖ నటి
X
రీల్ తారలు కొందరు రియల్ గా తమ సత్తా చాటుతుంటారు. తాజాగా అలాంటిదే ఒక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ తో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన సీనియర్ నటి..ఒకప్పటి స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా ఊహించని రీతిలో ఒక అంశంపై కోర్టును ఆశ్రయించటం ఆసక్తికరంగా మారింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ నెట్ వర్కుతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం ఉంటుందన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేస్తున్నారు.

అందుకే 5జీ నెట్ వర్కును తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. దీనికి సంబంధించిన పిల్ ను ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సి. హరిశంకర్ ముందుకు విచారణకు రాగా.. ఆయన మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనికి సంబంధించిన విచారణ రేపు (జూన్ 2, మంగళవారం) విచారణ జరగనుంది.

5జీ నెట్ వర్కుతో రేడియేషన్ ఇప్పుడున్న దాని కంటే ఎక్కువగా పెరుగుతుందన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేస్తున్నారు. 10 రెట్ల నుంచి 100 రెట్ల వరకు రేడియేషన్ పెరుగుతుందని.. భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి.. జంతువు.. పక్షి.. కీటకం.. చెట్టు దీని నుంచి తప్పించుకోలేవని.. పర్యావరణానికి శాశ్వితమైన నష్టం వాటిల్లుతుందన్నారు. విలువైన జంతుజాలం.. పక్షులు అంతరించి పోతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. మరి.. కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.