Begin typing your search above and press return to search.

5జీపై పోరాటం : మౌనం వీడిన జూహీ చావ్లా

By:  Tupaki Desk   |   10 Aug 2021 6:31 AM GMT
5జీపై పోరాటం : మౌనం వీడిన జూహీ చావ్లా
X
దేశంలో 5జీ నెట్ వర్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు. ఇటీవల ఆమెకు కోర్టు 5జీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు రూ.20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణ వేత్త జూహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు.

కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్, కోర్టు సమయం వృథా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటీషన్ తిరస్కరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు.. దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని.. తన పోరాటం ప్రచారం.. ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు.

భారతదేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి జూహీ చావ్లా సోమవారం ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

మనుషులకు, జంతువులు, 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమే తెలియజేయాలని ఆర్టీఐతోపాటు వివిధ ఏజెన్సీలను కోరామని తెలిపారు. ఆ వివరాలను మీరూ పరిశీలించాలని.. ఓపికగా తను షేర్ చేసిన వీడియోలోని అంశాలను గమనించాలంటూ తన 11 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు.

దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు, పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ తమ వాదనను బలపరిచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జూహీ చావ్లా కృషి చేస్తున్నాని తెలిపింది.

5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10-100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జూహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

జూహ్లీ చావ్లా ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమానిగా కొనసాగుతున్నారు. జూహ్లీచావ్లా 5జీపై వ్యతిరేక వ్యాఖ్యలకు గాను ఢిల్లీ హైకోర్టు రూ.20 లక్షల జరిమానా ఇటీవల విధించింది. ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన వ్యాఖ్యలు ఈ జరిమానాకు కారణమయ్యాయి. 5జీ నెట్ వర్క్ వల్ల పశుపక్ష్యాదులకు పెద్ద ఎత్తున నష్టం కలుగుతోందని..తక్షణం ఈ 5జీ నెట్ వర్క్ ను నిషేధించాలని ఆదేశాలివ్వాలని ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. 5జీ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో కనీసం పరిశోధన పత్రాలు, ఆధారాలు కూడా ఆమె సమర్పించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు జూహీ చావ్లాపై సీరియస్ అయ్యింది.

పబ్లిసిటీ కోసం పిటీషన్ వేసినట్లుగా ఉందని తక్షణం రూ20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పి జూహీ చావ్లాకు షాకిచ్చింది. అయితే ఈ పిటీషన్ వేయడమే జూహ్లీ చావ్లాకు ఫైన్ వేయడానికి ఇదే కారణం కాదని తెలిసింది.

ప్రస్తుతం కరోనా తో ఆన్ లైన్ లో కోర్టు సమావేశాలు జరుగుతున్నాయి. పిటీషనర్లకు ఈ ఆన్ లైన్ లింకును పంపుతుంటారు. వారు మాత్రమే ఓపెన్ చేసి చూడాలి. కానీ జూహీ చావ్లా ఆ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరూ నెటిజన్లు ఓపెన్ చేసేసరికి దీంతో కోర్టు ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

న్యాయప్రక్రియను జూహీచావ్లా అవమానించారని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఆమెపై 20 లక్షల భారీ ఫైన్ విధించింది. ఏదో చేద్దామనుకున్న జూహ్లీ చావ్లా తనకు కనీసం అవగాహన లేకుండా చేసిన పనికి ఇప్పుడు భారీ జరిమానాకు గురైంది. కానీ తన వాదనకు ఇప్పటికీ జూహీ చావ్లా వెనక్కి తగ్గకపోవడం విశేషం.