Begin typing your search above and press return to search.

ఆ జ్యూసే అమ్మ మ‌ర‌ణానికి కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   18 April 2017 4:54 AM GMT
ఆ జ్యూసే అమ్మ మ‌ర‌ణానికి కార‌ణ‌మా?
X
దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి.. త‌మిళుల‌కు అమ్మ‌గా సుప‌రిచితురాలు జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రొక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. అమ్మ మ‌ర‌ణానికి.. వైద్యుల అనుమ‌తి లేకుండా ఇచ్చిన పండ్ల ర‌స‌మే కార‌ణంగా చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ఎవ‌రూ ప‌ల్లెత్తు మాట చెప్ప‌న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం భారీ ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చేరిన జ‌య‌ల‌లిత‌.. ఓద‌శ‌లో కోలుకున్నార‌ని.. మ‌రికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ కావ‌ట‌మే త‌రువాయి అన్న‌ట్లుగా పెద్ద ఎత్తున వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీనికి భిన్నంగా ఆమె మ‌ర‌ణం చోటు చేసుకుంది. అయితే.. ఆమె మ‌ర‌ణానికి అంద‌రూ చెబుతున్న‌ట్లు గుండెనొప్పి ఎంత‌మాత్రం కాద‌ని.. ఆమె మ‌ర‌ణానికి జ్యూసే కార‌ణంగా సామాజిక మాథ్య‌మాల్లో భారీ ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చిన కొత్త క‌థ‌నం.. ఇప్పుడు కొత్త త‌ర‌హా చ‌ర్చ‌కు తెర తీసింది.

ఆసుప‌త్రిలో బాగా కోలుకున్న ద‌శ‌లో.. వైద్యుల అనుమ‌తి లేకుండా ఇచ్చిన జ్యూస్ అమ్మ మ‌ర‌ణానికి కార‌ణంగా మారింద‌న్న‌ది తాజా టాక్‌. ఈ స‌మ‌యంలో డ్యూటీలో ఉన్న న‌ర్సులు కూడా అమ్మ‌ను ప‌ట్టించుకున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ క‌థ‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారి.. అంద‌రి నోటా విశేషంగా నానుతోంది.

ఇదిలా ఉంటే.. అమ్మ మ‌ర‌ణంపై అనేక అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో.. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూప‌మైన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స‌హాయం నేతృత్వంలో విచార‌ణ క‌మిష‌న్‌ ను ఏర్పాటు చేయాలంటూ ఐఆర్ ఎస్ అధికారి బాల‌ముర‌గ‌న్ తాజాగా కోర్టులోఒక పిటీష‌న్ వేశారు.

అమ్మ మ‌ర‌ణంపై ఇప్ప‌టికే కోర్టు దృష్టికి వ‌చ్చిన ప‌లు పిటిష‌న్ల‌తో క‌లిపి.. తాజా పిటిష‌న్‌ ను స్వీక‌రించ‌నున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. ఇందులో భాగంగా జులై 4కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో అమ్మ మ‌ర‌ణంపై మ‌రెన్ని సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌స్తాయో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/