Begin typing your search above and press return to search.
130 కార్లతో జంప్.. అంతలా ఎలా ముంచేశాడంటే?
By: Tupaki Desk | 30 Nov 2021 11:30 AM GMTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మోసం మన చుట్టూ మోసం మాట వినిపిస్తూ ఉంటుంది. అయ్యో.. పాపం అనుకుంటాం కానీ.. అసలు విషయం ఏమంటే.. మోసం చేసే వాడికి మోసపోయేవాడే అవకాశం ఇస్తారన్న లాజిక్ ను చాలామంది మిస్ అవుతారు. చాలా మోసాల్ని చూసినప్పుడు.. ఎదుటోడిలో ఉన్న ఆశను.. అత్యాశను తమకు తగ్గట్లుగా మలుచుకొని.. వారికి మాటలు చెప్పి మోసపోయేలా చేస్తారు. మనలో ఆశ అన్నది బేసిగ్గా లేకుంటే.. చేసేదేమీ ఉండదన్నది మర్చిపోకూడదు. తాజాగా వెలుగు చూసిన ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది.
ట్రావెల్స్ పేరుతో వ్యాపారం షురూ చేసిన ఒక వ్యక్తి తాజాగా తన దగ్గరున్న 130 కార్లను తీసుకొని జంప్ అయిన వైనం షాకింగ్ గా మారింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరానికి దగ్గర్లో ఉండే నెలమంగల ప్రాంతంలో ఇలాంటి మోసం ఒకటి చోటు చేసుకుంది. ఏడాది క్రితం తమిళనాడుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి నాగసంద్రలో ఆర్ ఎస్ ట్రావెల్స్ పేరుతో పెద్ద ఆఫీసు తెరిచాడు.
తన మాటలతో చుట్టుపక్కల ఉన్న వారిని ఆకర్షించాడు. ఎవరి కార్లనైనా తన దగ్గర ఉంచితే వాటిని అద్దెకు తిప్పుతానని.. నెలవారీగా వారికి డబ్బులు చెల్లిస్తానంటూ ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చారు. అతడి మాటల్నినమ్మిన పలువురు అతడికి తమ కార్లను ఇచ్చేశారు. ఇలా అతడి వద్ద ఉన్న కార్ల సంఖ్య 130కు చేరాయి. ఈ కార్ల విలువ దగ్గర దగ్గర రూ.10 కోట్లకు పైనే ఉంటాయని చెబుతున్నారు.
ప్రతి నెల ఎనిమిదో తారీఖు వచ్చేసరికి కార్ల యజమానుల బ్యాంకు ఖాతాల్లో ఠంచనుగా డబ్బులు వేసేవాడు. దీంతో.. కార్ల యజమానులుసైతం హ్యాపీగా ఫీలయ్యేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నవంబరు నెలలో మాత్రం ఎనిమిదో తారీఖు దాటినా బ్యాంకులో పడాల్సిన డబ్బులు పడలేదు. ఒకట్రెండు రోజులు ఆలస్యమవుతాయన్న ఉద్దేశంతో పెద్దగా పట్టించుకోలేదు. క్యాలెండర్లో డేట్లు మారుతున్నా బ్యాంకులో డబ్బులు పడకపోవటంతో ఫోన్ చేశారు. అవి కాస్తా స్విఛాప్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి.. ఆఫీసు వద్దకు వచ్చారు.
ఆఫీసుకు తాళం వేసిన అతను జంప్ అయ్యాడని తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. మొత్తం 130 కార్లతో అతగాడు బిచాణా ఎత్తేశాడన్న విషయాల్ని తెలుసుకొని.. తమను తెలివిగా మోసం చేసిన వైనాన్ని అర్థం చేసుకున్నారు. లబోదిబోమంటూ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.