Begin typing your search above and press return to search.
ఫ్యాన్ నీడన ఉక్కబోత.. సైకిలెక్కనిస్తారా... ?
By: Tupaki Desk | 10 Dec 2021 2:30 AM GMTరాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ చేయడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటే. జగన్ 151 సీట్లతొ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పయ్యేళ్ళు తమ పార్టీదే పవర్ అంటూ ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్పేవారు. దాంతో ఇతర పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇంతటి ఏకపక్ష విజయం చూసిన తరువాత కనీసం రెండు టెర్ముల దాకా వైసీపీకి ఢోకా లేదని కూడా కరడు కట్టిన టీడీపీ నేతలు కూడా భావించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే పాలనానుభవం లేకపోవడం ఏపీ విభజన గాయాలతో సతమతం కావడం, కరోనా వంటి ప్రపంచ విపత్తుతో ఏపీ ఇంకా కృంగిపోవడం, ప్రయరిటీస్ ఎంపిక చేసుకోవడంతో జగన్ తడబాట్లు పడడం, కొన్ని వివాదాలను ప్రభుత్వం తానే కోరి కెలుక్కోవడం వంటి వాటి వల్ల వైసీపీ గ్రాఫ్ సగం పాలనకే బాగా తగ్గిపోయింది అన్న నివేదికలు అయితే ఉన్నాయి. మరో రెండున్నరేళ్లలో ఇంకా డౌన్ ఫాల్ ఉంటుంది తప్ప గ్రాఫ్ పెరిగే చాన్స్ లేదని తలపండిన రాజకీయ నేతలు అంచనా కడుతున్నారు.
ఈ నేపధ్యంలో నాడు అత్యుత్సాహంతో టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారంతా ఇపుడు తీవ్రంగా మధన పడుతున్నారు. పదవులు అన్నీ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే జగన్ కట్టబెట్టారు. తమదాకా వచ్చే సీన్ అయితే ఇపుడు లేదు. పైగా పదవులు అన్నీ కూడా దాదాపుగా భర్తీ అయిపోయాయి. మరో సారి కనుక పార్టీ పవర్ లోకి వస్తే అపుడు సంగతి అనేస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో నాడు హడావుడిగా సైకిల్ దిగి ఫ్యాన్ నీడకు చేరిన వారంతా తెగ ఉక్కబోతకు గురి అవుతున్నారు.
వైసీపీలో ఉంటే అసలు రాజకీయాలకే దూరం అవుతామన్న భయం వారికి పట్టుంది. విశాఖ జిల్లాలోనే చూసుకుంటే అప్పట్లో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పదుల సంఖ్యలో వైసీపీలో చేరిపోయారు. రెండేళ్లు గడచినా వారు ఎక్కడ ఉన్నారో అక్కడే మిగిలిపోయారు తప్ప దశ దిశ అన్నది కానరావడంలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో కనీసం వైసీపీ టికెట్ అయినా వస్తుందా అన్న డౌట్ కూడా ఉందిట. ఇక టికెట్ వచ్చినా వైసీపీకి మునుపటి ఊపు లేకపోతే గెలవడం కష్టమే అన్న ఆలోచనలో వారున్నారు.
దాంతో వారంతా పునరాలోచలో పడ్డారు అని అంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఒక మైనారిటీ లీడర్ అయితే ఎమ్మెల్సీ పదవి మీద ఆశ పెట్టుకున్నారు. కానీ దక్కలేదు, అలాగే బలమైన సామాజిక వర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఉన్న పార్టీతో విసిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లొ గాజువాక టికెట్ ని ఆశిస్తున్న ఇంకో మాజీ ఎమ్మెల్యే తనకు రాదు అని నిర్ణయించుకున్న మీదట వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించేశారని టాక్.
ఇదే విధంగా కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి అక్కడ నుంచి వైసీపీలో చేరిన ఒక మాజీ మంత్రి పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉందిట. ఆయన తన రాజకీయ వారసురాలుగా ఉన్న కుమార్తె కోసమైనా పార్టీ మారాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇలా చాలా పెద్ద లిస్ట్ అయితే ఇపుడు వైసీపీలో ఉంటూనే రగిలిపోతోంది. అయితే తిరిగి టీడీపీలోకి వెళ్తే తమను చేర్చుకుంటారా. మునుపటి ఆదరణ దక్కుతుందా అన్న సంశయం కూడా వారిని పట్టి పీడిస్తోందిట.
ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ వారిని అసలు చేర్చుకోమని, జంపింగ్ జఫాంగులకు ఈ దఫా టికెట్లు ఇచ్చే చాన్సే లేదని పక్కా క్లారిటీతో స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో టీడీపీలో చేరాలని చూస్తున్న వారంతా బాబు మనసు మారకపోతుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి విశాఖ వంటి టీడీపీ కంచుకోటలో మాజీ తమ్ముళ్ళు పార్టీని వీడితే వైసీపీకి అది రాజకీయంగా తీరని నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.
అయినా వైసీపీలో ఉన్న రాజకీయ అయోమయం కారణంగా ఇలాంటి వారికి ఎవరూ భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగేలా చేయలేరు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. టీడీపీని వీడిన వారంతా వెనక్కి వస్తే కనుక టీడీపీకి కొండంత బలం అనడంలో సందేహమే లేదు అని చెప్పాలి.