Begin typing your search above and press return to search.

క‌త్తి మ‌హేష్ పై న‌టి బ‌లాత్కార ఆరోప‌ణ‌లు!

By:  Tupaki Desk   |   14 April 2018 12:11 PM GMT
క‌త్తి మ‌హేష్ పై న‌టి బ‌లాత్కార ఆరోప‌ణ‌లు!
X
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై న‌టి శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన చాలామంది ప్ర‌ముఖుల‌పై శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా, ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సునీత షాకింగ్ కామెంట్స్ చేసింది. క‌త్తి మ‌హేష్ త‌న‌ను బ‌ల‌వంతం చేయ‌బోయాడ‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయ‌బోయాడ‌ని, అడ్డుకోబోతే తనను కొట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ప్ర‌ముఖ టీవీ షో లైవ్ డిబేట్ లో పాల్గొన్న కత్తి మహేష్ పై ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అనూహ్యంగా మ‌హేష్ పై సునీత ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆ షో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

క్యాస్టింగ్ కౌచ్ లో కో ఆర్డినేట‌ర్ల పాత్ర‌పై ఓ చానెల్ లో లైవ్ డిబేట్ నిర్వ‌హించారు. ఆ షోలు సునీత‌, క‌త్తి మ‌హేష్ పాల్గొన్నారు. అయితే, అనూహ్యంగా ఆ షోలో పాల్గొంటోన్న మ‌హేష్ పై సునీత షాకింగ్ కామెంట్స్ చేసింది. గ‌తంలో ఆయ‌న త‌న‌ను బ‌లాత్కారం చేయ‌బోయాడ‌ని ఆరోపించింది. త‌న‌కు క‌త్తి మ‌హేష్ సంవ‌త్స‌రం నుంచి ఫేస్ బుక్ ఫ్రెండ్ అని, బిగ్ బాస్ కు ముందు ఫిల్మ్ క్రిటిక్ గా మామూలు ప‌రిచయం ఉంద‌ని సునీత చెప్పింది. ఆయ‌న బిగ్‌బాస్ కి ఎంపిక‌వ‌డంతో తాను కూడా షాక్ అయ్యాన‌ని, ఎలిమినేషన్ అయ్యాక ఆయ‌న‌తో మాట్లాడాన‌ని చెప్పింది. త‌న‌ను ఫ్లాట్ కి వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని ఫేస్‌బుక్ లో అడ్రస్ పెట్టాడని చెప్పింది. ఇంటికి వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగితే తాను నో చెప్పాన‌ని తెలిపింది. అప్పుడు ఇంటి డోర్ వేసి..త‌న‌ను కొట్టి.. బలవంతం చేయ‌బోని ఆమె ఆరోపించింది. అయితే, తాను ప్ర‌తిఘ‌టించాన‌ని, ఈ విష‌యం ఫేస్ బుక్ లైవ్ లో పెడ‌తాన‌ని బెదిరించ‌డంతో త‌న‌ను వ‌దిలేశాడ‌ని చెప్పింది.

ఆ తర్వాత త‌న‌కు బస్ టికెట్ కి రూ.500 ఇచ్చి ...ఈ విష‌యం పై గొడ‌వ చేయ‌వ‌ద్ద‌ని ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించాడ‌ని తెలిపింది. ఆ రోజు తాను ప్ర‌యాణించిన బ‌స్సు టికెట్ ఉంద‌ని, తాను ప్ర‌యాణించిన క్యాబ్ డ్రైవ‌ర్ ను సాక్ష్త్యంగా తీసుకువ‌స్తాన‌ని చెప్పింది. గ‌తంలో తాను కత్తి మహేష్‌ పై కంప్లైంట్ ఇవ్వడానికి లీగల్ గా వెళ్లానని, ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్ కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోందని తెలిపింది. ఈ డిబేట్ జ‌రుగుతున్న‌ చానెల్ కు కూడా తాను వ‌చ్చాన‌ని, కానీ, ప్ర‌స్తుతం మ‌హేష్ షోల‌తో బిజీగా ఉన్నామ‌ని చెప్పి పంపించార‌ని తెలిపింది. ఇటువంటి వ్య‌వ‌హారాల‌పై కోర్టులో కేసులేయాలని, పోలీస్ స్టేషన్లకు వెళ్లాలని పవన్ సార్ చెప్పార‌ని, కానీ త‌మ ఫిర్యాదులు తీసుకోర‌ని, తీసుకున్నా ప‌ట్టించుకోర‌ని అందుకే తాము మీడియాను ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పింది. నిజంగా మ‌హేష్ నిజాయితీపరుడైతే త‌న‌ను ఫేస్ బుక్ లో బ్లాక్ ఎందుకు చేశాడ‌ని ప్ర‌శ్నించింది.

అయితే, సునీత త‌న‌కు ఏడాది నుంచి తెలుస‌ని, త‌న‌కు అవ‌స‌ర‌మున్న‌పుడు కొంత డ‌బ్బులిచ్చాన‌ని మ‌హేష్ చెప్పారు. త‌న‌పై ఆమె త‌న‌పై బ‌లాత్కార ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని, త‌న‌పై పోలీసులు ఫిర్యాదు చేస్తాన‌ని సునీత చెప్పింద‌ని, ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకుంటాన‌ని మ‌హేష్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ ఏవిధంగా స్పందిస్తారో ఆస‌క్తిక‌రంగా మారిందిజ‌