Begin typing your search above and press return to search.
కేసీఆర్ చెప్పింది చేయలేదా? షాకిచ్చే ప్రకటన చేసిన జూడాలు
By: Tupaki Desk | 26 May 2021 4:30 AM GMTమాట అంటే మాటే. ఒకసారి కమిట్ అయితే.. వెనక్కి తగ్గే పనే లేదన్నట్లుగా ఉంటుంది సీఎం కేసీఆర్ తీరు. ఎవరైనా ఏదైనా సమస్య పరిష్కారం కోసం వస్తే.. వారికి ముందు అపాయింట్ మెంట్ దొరకదు. ఒకవేళ.. ఇష్యూ మీద సారు సానుకూలంగా ఉంటే.. అపాయింట్ మెంట్ ఇవ్వటమే కాదు.. వారికి కడుపు నిండేలా నిర్ణయాన్ని ప్రకటించి.. భోజనం చేయించి మరీ హ్యాపీగా పంపటం కేసీఆర్ కు అలవాటే. గతంలో ఇదే తీరును ఎన్నో సందర్భాల్లో ప్రదర్శించారు.
అలాంటి కేసీఆర్.. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల్ని ఆయనకు చెప్పటం.. దానికి సానుకూలంగా స్పందిస్తూ.. వెంటనే వారి డిమాండ్లను తనకు పంపాలని.. సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పటం తెలిసిందే. కేసీఆర్ తనకు తానుగా ఇలాంటి వ్యాఖ్య చేసిన తర్వాత.. నిర్ణయం వెంటనే తీసుకోవటం అలవాటు. కట్ చేస్తే.. తాజాగా జూనియర్ డాక్టర్లు ఇవాల్టి సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించటం షాకింగ్ గా మారింది. అత్యవసర సేవలు మినహా.. పరిమితంగా విధుల్ని బహిష్కరిస్తామన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వారాసి నవీన్.
ఈ రోజు.. రేపు (బుధ.. గురు) రెండు రోజులు అత్యవసర సేవలు మినహా కొవిడేతర విధులతో పాటు ఐసీయూ.. క్రిటికల్ కేర్ మినహా మిగిలిన అన్ని కొవిడ్ విధులకు గైర్హాజరు అవుతున్నట్లు చెప్పారు. అప్పటికి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకుండా ఈ నెల 28 నుంచి కొవిడ్.. కొవిడేతర విధుల్ని బహిష్కరిస్తామంటున్నారు. అదేంటి కేసీఆర్ స్వయంగా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఇన్ని రోజులకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అయితే.. జూనియర్ డాక్టర్ల వాదనకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి. పీజీ వైద్య విద్యార్థుల బాగోగుల గురించి సీఎం సానుకూలంగా స్పందించారని.. ఇటీవల 15 శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో కూడా జారీ చేశారని చెబుతున్నారు. పొరుగున ఉన్న ఏపీలో పీజీ మొదటి సంవత్సర విద్యార్థి ఉపకార వేతనం రూ.44,075 అయితే.. తెలంగాణలో ఇటీవల పెంచిన తర్వాత మొదటి సంవత్సరం పీజీ విద్యార్థికి నెలకు రూ.50,686 అందుతుందని చెప్పారు. అయితే.. ఈ పెంచిన మొత్తంపై గుర్రుగా ఉన్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు చెబుతున్నారు. మరి.. డీఎంఈ వాదనకు జూనియర్ వైద్యులు ఏం చెబుతారో చూడాలి.