Begin typing your search above and press return to search.
కేసీఆర్, కేటీఆర్ కు భారీ షాకిచ్చిన జూపల్లి
By: Tupaki Desk | 25 Jan 2020 6:19 AM GMTజూపల్లి కృష్ణారావు.. మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ నుంచి గతంలో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయారు. ఈయన పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సైతం గులాబీ పార్టీలో చేరడంతో జూపల్లి నిరాదరణకు గురయ్యారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి వర్గాన్ని కాదని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గానికే పెద్దపీట వేసింది. సీట్లు ఇచ్చింది.
దీంతో రగిలి పోయిన మాజీ మంత్రి జూపల్లి కొల్లాపూర్ మున్సిపాలిటీలో తన వర్గం వారిని టీఆర్ఎస్ రెబల్స్ గా బరిలోకి దింపారు. దీంతో అక్కడ రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రిగా సాగింది. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ చెప్పినా జూపల్లి వినకుండా తనను నమ్ముకొని ఉన్న అభ్యర్థులతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేయించారు.
టీఆర్ఎస్ సీట్లు ఇవ్వకుండా జూపల్లిని పక్కన పెట్టడంతో ఆయన కొల్లాపూర్ లోని 20 స్థానాలకు టీఆర్ఎస్ రెబల్స్ ను రంగంలోకి దింపి టీఆర్ఎస్ కు షాకిచ్చారు.
తాజా మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చారు జూపల్లి. కొల్లాపూర్ లోని మొత్తం 20 స్థానాల్లో 16 చోట్ల జూపల్లి బలపరిచిన టీఆర్ఎస్ రెబల్స్ పార్టీ విజయం సాధించడం విశేషం. కేవలం 4 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించి బొక్కా బోర్లా పడింది. సొంత పార్టీపైనే మాజీ మంత్రి జూపల్లి విజయం సాధించడం సంచలనంగా మారింది.
కేటీఆర్, కేసీఆర్ చెప్పినా వినకుండా మొండిగా ముందుకెళ్లిన జూపల్లి చివరకు తన పంతం నెగ్గించుకొని గులాబీ పార్టీ కి షాకిచ్చారు. మరి ఆయన టీఆర్ఎస్ కే మద్దతిస్తారా లేదా అన్నది వేచిచూడాలి.