Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ను అంతమాట అంటారా?
By: Tupaki Desk | 7 Feb 2016 8:39 AM GMTహైదరాబాద్ కు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి ఉంది. ఆ ఖ్యాతిని మరింత రెట్టింపు చేయడానికి... నగరాన్ని ఇంకెంతో అభివృద్ధి చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే... ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు మాత్రం హైదరాబాద్ ను చెత్త బిరుదు ఇచ్చారు. హైటెక్ సిటీగా అందరూ పిలుచుకునే భాగ్యనగరాన్ని ఆయన కంపు నగరమని పేర్కొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ కంపు నగరంగా మారిపోయిందని జూపల్లి చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని మార్చి 2019 నాటికి హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే అందుకు కార్యాచరణ మొదలైందని... 2019 నాటికి హైదరాబాద్ సుందర నగరంగా మారిపోవడం ఖాయమని జూపల్లి గ్యారంటీ ఇస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ, బంగారు తెలంగాణ సాధ్యమని పేర్కొన్నారు. 2019 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌ను స్వచ్ఛంగా మారుస్తామని వివరించారు. ప్రస్తుత విద్యావిధానంపైనా ఆయన కామెంట్లు చేశారు. సమాజానికి ఉపయోగపడేలా మనిషిని తీర్చిదిద్దగలి గేది విద్య అని, దశాబ్దాలుగా ఉన్న విద్యా విధానం వల్ల ఉన్నమతి కూడా పోయేలా ఉందన్నారు.