Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన జూపల్లి
By: Tupaki Desk | 21 July 2016 10:22 AM GMTరాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు శ్రుతి మించుతున్నాయి. ఒకప్పుడు విమర్శలకు సైతం కొన్ని పరిమితులు ఉండేవి. అయితే, రానురాను తమ మైలేజీని పెంచుకోవడం కోసం ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు ఎదుటి పార్టీపై నోరు పారేసుకోవడం మామూలైపోయింది. నువ్వు ఒకటంటే.. నేను రెండంటా అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు నేతలు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ మాజీ మంత్రి - గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ.. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను గాడ్సేతో పోలుస్తూ విమర్శించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన టీఆర్ ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తన నాలికకి మరింత పదునుందని నిరూపించారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీ నేతలను రాక్షసులతో పోల్చారు. ముఖ్యంగా బీజేపీ నేత - మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డిని మారీచుడని పేర్కొన్నారు.
అదేవిధంగా టీటీడీపీ పక్ష ఉప నేత రేవంత్ రెడ్డిని సుబాహుగా - కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణను తాటకిగా అభివర్ణించారు. అదేసమయంలో కేసీఆర్ ను పరోక్షంగా విశ్వామిత్రుడితో పోల్చారు జూపల్లి. లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు యాగం చేస్తే - భగ్నం చేసే రాక్షసులు మారీచుడు - సుబాహు - తాటకిల మాదిరి వీరు ముగ్గురు వ్యవహరిస్తున్నారని జూపల్లి నిప్పులు చెరిగారు.
తెలంగాణలోని పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేసీఆర్ అహర్నిశలూ ప్రయత్నిస్తుంటే ఈ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా మారాయి. నిజంగానే ఆ నేతలు తెరాస - కేసీఆర్ విషయంలో జూపల్లి చెప్పినట్టు రాక్షసుల్లా (విమర్శలు చేయడంలో) వ్యవహరిస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం. ఏదేమైనా నేతలు చేసే విమర్శలు ఇటీవల హాట్ హాట్ గా మారి చర్చకు దారితీస్తున్నాయి.